Tirumala: తిరుమల లడ్డు వ్యవహారం… కీలక విషయాలు బయటపెట్టిన సిట్!

Tirumala: కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు గురించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్రదమారం రేపాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడిని అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదని జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యితో తిరుపతి లడ్డు తయారు చేసే భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనగా మారింది.

ఇక ఈ విషయంపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో కోర్టు సైతం కూటమి ప్రభుత్వాన్ని మందలించడమే కాకుండా ప్రత్యేక బృందంతో సిట్ విచారణ వేసింది అయితే సిట్ బృందం తిరుపతి లడ్డు తయారీ విధానంలో అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి లడ్డులో ఉపయోగించే నెయ్యి విషయంలో సిట్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

తిరుమలలో తయారీ కోసం ఉపయోగిస్తున్న నెయ్యి ఏఆర్‌ డెయిరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చింది. లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏఆర్‌ డెయిరీ నిర్వాహకులు ఆ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డైరీ నుంచి ఆ నెయ్యిని సేకరించినట్లు తెలియజేశారు.

ఇలా వైష్ణవి డైయిరీ నుంచి సేకరించిన ఆ నెయ్యిని నిర్వాహకులు ఏఆర్ డైయిరీ టాంకర్లలోకి నింపి తిరుమలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే టోల్ గేట్ల వద్ద ఆ ట్యాంకర్లు ఎంత సమయం ఆగి ఉన్నాయి ఎటు వెళ్తున్నాయి వాటి మార్గాలన్నింటినీ కూడా పరిశీలించారు. ఆ వివరాలను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు వివరించారు. అంతకుముందు వారు తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.