ఉన్నఫలంగా ఒక్కరోజులో, గంట వ్యవధిలో.. లక్షల మంది ఆశలపైనా, ఆలోచనలమైనా, నమ్మకాలపైనా ఒకేసారి నీళ్లు చల్లగలిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కాపు సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి దొరికాడని ఆ సమాజం మొత్తం ఆశగా చూసిన ఆనందాన్ని ఆవిరిచేస్తూ ఒక నిర్ణయం ప్రకటించారు. దీంతో… మరోసారి వెస్ట్ గోదావరిలోని భీమవరం.. ఉత్తరాంధ్రలోని గాజువాక నియోజకవర్గాలు తెరపైకి వచ్చాయి.
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాలు హాట్ టాపిక్ లు గా ఉండేవి. పులివెందుల, కుప్పం కంటే కూడా ఎక్కువగా మీడియా, జనాల ఫోకస్ ఉండేది. పవన్ రెండు చోట్లా గెలిచిన తర్వాత.. ఏ నియోజకవర్గానికి రాజినామా చేస్తారనే విషయంపై బెట్టింగులు కూడా నడిచాయనే వార్తలొచ్చాయి! ఇంతలోనే ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. టీవీ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ విత్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ లో ఒక వాయిస్ వినిపించింది.
భీమవరం, గాజువాకల్లో పోటీచేసిన జనసేన సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్… పోటీ చేసీన రెండు చోట్లా ఓడిపోయారు అని! గుడ్డిలో మెల్ల ఎంటంటే… మరీ మూడోస్థానానికి పడిపోకుండా.. రెండోస్థానంలో నిలిచారు! దీంతో… జనసైనికులంతా అ రెండు నియోజకవర్గాల్లోని ఓటర్లపై గుర్రుగా ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లోని ప్రజలకు పవన్ గురించి తెలియడం లేదని, పవన్ ను వారు తక్కువ అంచనా వేసుకున్నారని.. సీఎం అభ్యర్థి నియోజకవర్గం అంటే… అభివృద్ధి ఒక రేంజ్ లొ ఉండేదన్న విషయం.. ఈ రెండు నియోజకవర్గ ప్రజలు మరిచిపోయారని చెప్పుకొచ్చారు!
కట్ చేస్తే… తనకు సీఎం అయ్యేంత సీన్ లేదని, తాను ఒక సాధారణ ఎమ్మెల్యే అభ్యర్థిని అని, కాకపోతే పార్టీ ఒకటి ఉందికాబట్టి తనతో పాటు మరొకొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తారని చెప్పుకొచ్చారు పవన్. అంతేకాదు… చంద్రబాబుని సీఎం ని చేసేవరకూ విశ్రమించొద్దని జనసైనికులు అని చెప్పూనే జనసేన కేడర్ కు అల్టిమేటం జారీ చేశారు! దీంతో…. భీమవరం – గాజువాక లోని ఓటర్ల ముందు చూపుకు సలాం కొడుతున్నారంట ఇతర నియోజకవర్గాల్లోని మాజీ జనసైనికులు! ఇలా ఎలా ఊహించగలిగారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారంట. ఫలితంగా… ఆ రెండు నియోజకవర్గాల ఓటర్లకు ఆన్ లైన్ వేదికగా కంగ్రాట్స్ చెబుతూ సంక్షిప్త సందేశాలు పంపుతున్నారంట ఒకప్పటి జనసైనికులు!