ఏ సినిమా అయినా ఆఖరికి ఏ ఇష్యూ అయినా పబ్లిసిటీ చేస్తే ఆ ఇష్యూకి కానీ, సినిమాకి కానీ వచ్చే పాపులారిటీ వేరే లెవల్. సినిమా హిట్టవ్వాలంటే పబ్లిసిటీ ఓ రేంజ్లో వుండాలి. కంటెంట్ లేకున్నా కొన్ని సినిమాల విషయంలో పబ్లిసిటీతోనే హిట్టు కొట్టిన సందర్భాలు అనేకం.
అసలు మ్యాటర్ ఏంటంటే, హీరోయిన్ మనారా చోప్రా ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది. అందుకు కారణం ఆమెని ఓ డైరెక్టర్ పబ్లిగ్గా ముద్దు పెట్టుకోవడమే. ఓ చిన్న సినిమా పబ్లిసిటీలో భాగంగా పబ్లిక్‌లో అందరి ముందూ అదేనండీ ఆఫ్ స్ర్కీన్ ఓ డైరెక్టర్ పేరెందుకులెండి.. మన హీరోయిన్ని ముద్దాడేశాడు.
అది చూసి అంతా అవాక్కయ్యారు. ఇంత కక్కుర్తి ఎందుకు.? అంటూ ఆ డైరెక్టర్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫుల్‌గా వేసుకుంటున్నారు. ఈ లోపు ఆ డైరెక్టర్‌కి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రముఖ దర్శకుడు పిలిపించి మరీ ఛీవాట్టు పెట్టాడనీ ప్రచారం జరుగుతోంది.
అత్యంత సన్నిహితుడు, సీనియర్ డైరెక్టర్ అయిన ఆయన ఇదేం పద్ధతి.. అని గట్టిగానే రౌండేసుకున్నాడట. అయితే, మనారా చోప్రా మాత్రం ఈ ఇష్యూలో తనకేం తెలీదన్నట్లుగా ఫ్రీ పబ్లిసిటీ రాక రాక వచ్చిందన్నట్లుగా ఆఫ్ స్ర్కీన్ తెగ నటించేసింది.
సినిమాల్లో ఈ అమ్మడికి నటించడం చేతకాకపోయినా స్టేజ్ మీద మాత్రం మహానటిలా బిల్డప్ ఇచ్చేసింది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ పబ్లిసిటీనే అంటున్నారు కొందరు.
గతంలో కాజల్ అగర్వాల్ విషయంలో ఓ సినిమాటోగ్రఫర్ కూడా ఇలాంటి ఓవరాక్షనే చేశాడు. అది అప్పట్లో చాలా పెద్ద వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.