నటనలో ఏ మాత్రం తనకు సాటిలేదని కమలహాసన్ మరోమారు నిరూపించాడు. శంకర్ మార్క్ సినిమాతో చాలా ఏళ్ల తరవాత మరోసారి అవినీతిపై పోరాటం చేశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ప్రయోగాలు చేసే విషయంలో ఎంతటి రిస్క్ అయినా చేసే యాక్టర్లలో కమల్ హాసన్ ముందుంటాడు. అవినీతి, లంచం లాంటి అంశాలను కమల్ హాసన్ టైటిల్ రోల్‌లో ‘భారతీయుడు’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై చూపించి.. అప్పట్లోనే గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు దర్శకుడు శంకర్. మళ్లీ 28 ఏళ్ల తర్వాత అదే కథాంశంతో తెరకెక్కించిన సీక్వెల్ ‘ఇండియన్ 2’ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది.
తెలుగులో ‘భారతీయుడు 2’గా విడుదలైంది. అవినీతి అంశాల చుట్టూ తిరిగే సన్నివేశాలతో శంకర్ శైలిలో మొదలవుతుంది ‘ఇండియన్ 2’. మెల్లగా సిద్దార్థ్ సింపుల్ ఇంట్రడక్షన్‌తో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తాడు. దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకీ ఎలా పెరిగిపోతుందో తెలియజేసేలా సిద్దార్థ్ అండ్ గ్యాంగ్ సోషల్ విూడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. అటు నుంచి రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం ఉంటుంది. కట్ చేస్తే.. కథ తైవాన్‌కు మారిపోతుంది.
ఇక మొదటి సాంగ్ టైం.. క్యాలెండర్ సాంగ్‌తో బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ గ్రోవర్ స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అసలు ‘ఇండియన్ ‘2ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా..? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ఉలగనాయగన్ వస్తాడు. సేనాపతిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ మార్షల్ ఆర్ట్స్‌లో స్కిల్స్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే సన్నివేశాలు ఉంటాయి. ఇక అవినీతి రాజ్యమేలుతున్న భారతదేశంలోకి సేనాపతి ప్రవేశం అనివార్యమైన సందర్భంలో ఇండియాలో ల్యాండింగ్ అవుతాడు సేనాపతి. ఇప్పుడు సేనాపతిగా టైటిల్ రోల్‌ను ఎలివేట్ చేసేలా తాత వస్తడే సాంగ్ ఉంటుంది. శంకర్ మార్క్ విజువల్స్‌తో గ్రాండ్‌గా సాగే ఈ పాట సినిమాకు హైలెట్‌గా చెప్పొచ్చు.
అనంతరం సిద్దార్థ్ అండ్ గ్యాంగ్‌పై వచ్చే కొన్ని సన్నివేశాలుంటాయి. ఇక బాబీ సింహా చుట్టూ తిరిగి ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలతో సెకండాఫ్ షురూ అవుతుండగా.. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ సీన్లు వస్తాయి. అప్పటిదాకా ఒక మాదిరిగా సాగిన కథ కొంచెం సీరియస్ మూడ్‌లో వచ్చేస్తుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల తర్వాత కీలక మలుపు ఎంటో తెలుస్తోంది. కమల్ హాసన్ చేజింగ్ సీక్వెన్స్, ముష్కరమూకలతో ఫైట్ సీక్వెన్స్ వన్ మ్యాన్ షోలా సాగుతుంది. చిన్నపాటి ట్విస్ట్ ఇస్తూ ఊహించని విధంగా సినిమాకు శుభం కార్డు పడుతుంది. కమల్ హాసన్, సిద్దార్థ్ అండ్ గ్యాంగ్ సన్నివేశాలతో ఒకే అన్నట్టుగా సాగుతుంది.
కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయినా.. మరికొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యాయనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. విజువల్స్ క్లీన్‌గా ఉన్నప్పటికీ.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా గట్టిగా ఇచ్చి ఉంటే బాగుంటుందని మూవీ వలర్స్ అభిప్రాయపడుతున్నారు. కమల్ హాసన్ స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్‌తో వన్ మ్యాన్ ఆర్మీ షోలా సెకండాఫ్ సాగుతుంది. ఎప్పటిలాగే మరో బలమైన సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు శంకర్. కానీ ఈసారి మాత్రం ఎగ్జిక్యూషన్‌లో కొంత వెనకబడ్డాడనే టాక్ వస్తోంది. చివరి 30 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు మాత్రం కళ్లార్పకుండా చూసేలా గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలతో సాగుతుంది. శంకర్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇది అని అంటున్నారు నెటిజన్లు.