దత్త పుత్రుడన్నదీ.. ప్యాకేజీ అన్నదీ.. ఇవన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రుద్దిందీ ఇంకెవరో కాదు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్.!
ఇప్పుడేమో, ‘పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అంటారా.? దత్త పుత్రుడని అంటారా.? ఇంటెలిజెన్స్, సీఐడీ.. ఇవన్నీ మీ దగ్గరే వున్నాయ్ కదా.. నిరూపించండి..’ అంటూ వైసీపీకి సవాల్ విసురుతున్నారు నారా లోకేష్. రాజకీయాల్లో నాయకులు మాట మార్చడం అనేది చాలా చాలా చిన్న విషయం.
సో, నారా లోకేష్ కూడా ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. అయితే, ‘మేం, పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజీ ఇవ్వలేదు. గతంలో చేసిన రాజకీయ విమర్శలు, అప్పటి రాజకీయ అవసరాల నిమిత్తం చేశాం..’ అని నారా లోకేష్ ప్రకటించేయొచ్చు కదా.! అలా చేస్తే, గ్రౌండ్ లెవల్లో టీడీపీ – జనసేన కార్యకర్తలు మరింత సమర్థవతంగా కలిసి పని చేసేందుకు వీలవుతుంది.
‘లోకేష్‌తో చెప్పించగలిగాం. కొంత హ్యాపీ. కానీ, పూర్తిగా కాదు. పవన్ కళ్యాణ్ కోసం లోకేష్, బాలయ్య ఎదురు చూశారు. మా ఇగో కొంతవరకు శాటిస్ఫై అయ్యింది..’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కానీ, 2019 ఎన్నికల్లో జనసేన దారుణ పరాజయానికి టీడీపీనే కారణమన్న విషయాన్ని మాత్రం జనసైనికులు మర్చిపోలేకపోతున్నారు.
అంతే కాదు, 2009లో ప్రజారాజ్యం పార్టీకి టీడీపీ కొట్టిన దెబ్బని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా గుర్తు చేసుకుంటూనే వున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకోవడం అంటారు కదా.. అలా వుందిప్పుడు టీడీపీ – జనసేన మధ్య పొత్తు వ్యవహారం.
టైమ్ పడుతుంది.. అంతా సర్దుకోవడానికి. కానీ, టీడీపీ మద్దతుదారుల్లో ఓ సామాజిక వర్గానికి చెందినవారు టీడీపీ – జనసేన పొత్తుని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.