చిరంజీవి కోసం బాబీ ఇంకోటి.!

చిరంజీవితో బాబి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా తెరకెక్కించాడు. ఓ డైరెక్టర్‌గా కాకుండా, ఓ వీరాభిమానిగా ఈ సినిమాని తీశాడు బాబి. ఆ విషయాన్ని పలు మార్లు చిరంజీవే స్వయంగా చెప్పారు.

అంతేకాదు, ఈ సినిమా విజయం పైనా మెగాస్టార్ చిరంజీవి పూర్తి విశ్వాసంగా వున్నారు. ఇదే నమ్మకంతో, బాబీకి మరో బాధ్యత కూడా  అప్పగించినట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

అదేంటంటే, బాబీతో ఇంకో సినిమాకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఆల్రెడీ బాబీ, చిరంజీవికి కథ కూడా వినిపించేశాడట. ఆ కథ పట్ల చిరంజీవి సుముఖంగా వున్నారనీ తెలుస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’ రిజల్ట్‌తో సంబంధం లేకుండానే చిరంజీవి, బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అంతలా బాబీ, చిరంజీవిని ఇంప్రెస్ చేశాడన్న మాట. అందుకే అతని పనితనానిని తాను అభిమానినైపోయానంటూ ప్రమోషన్ వేదికలపై బాబీ గురించి చిరంజీవి చాలా సార్లు చెప్పడం విశేషం.

అయితే, బ్యాక్ టు బ్యాక్ బాబీకి ఛాన్సిస్తాడా.? లేదంటే, ఈ లోపు మిగిలిన ప్రాజెక్టులు కంప్లీట్ చేసి, ఆ తర్వాత బాబీతో సినిమాకి సై అంటాడా చూడాలి మరి.