చంద్రబాబుకు 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల చుట్టూ ఏపీలో రసవత్తర రాజకీయం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులపై నోరు మెదపరెందుకు అని చంద్రబాబు & కో ని వైసీపీ తీవ్రంగా ర్యాగింగ్ చేస్తుంది. అయితే ఇప్పటివరకూ ఆ విషయం చంద్రబాబు స్పందించలేదు. అయితే తాజాగా ఈ విషయంపై ఏపీ టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు.
చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసులపై అటు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, టీడీపీ అనుకూల మీడియా కానీ ఆ విషయాన్ని ప్రస్థావించలేదు. ఇక టీడీపీ నేతలు సైతం మౌనాన్నే తమ బాషగా చేసుకున్నారు. కనీసం ఆ నోటీసులను ఖండించే సాహసం కూడా చేయలేకపోయారు. ఇక పవన్ కల్యాణ్ కూడా ప్రశ్నించలేదు! ఈ సమయంలో బోండా ఉమ మైకందుకున్నారు.
ఢిల్లీ స్థాయిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ లాబీయింగ్ చేసి, చంద్రబాబుకు తప్పుడు నోటీసులు ఇప్పించారని చెప్పుకొచ్చారు. అంతేకాదు… ఐటీశాఖ నోటీసులు ఇచ్చినం మాత్రాన్న చంద్రబాబు అవినీతిపరుడు కాదని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చెప్పుకొచ్చారు. దీంతో కీబోర్డులకు పని చెబుతున్నారు నెటిజన్లు!
చంద్రబాబు అవినీతి చేశాడని మోడీ సర్కార్ నేతృత్వంలో పనిచేసే ఐటీ శాఖ నోటీసులు పంపితే అది జగన్ పనే అని చెప్పడాన్నీ నిస్సిగ్గు చర్యగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. బీజేపీ పార్టీగా ఏపీ చీఫ్ గా ఉన్నది పురందేశ్వరి అని, ఆమె కు చంద్రబాబు కు ఇప్పుడు టెరంస్ బాగున్నాయని.. ఫలితంగా హస్తినలో రాయబారాలు జరుగుతున్నాయని అంటున్నారు.
అలాంటిది ఆమెకు తెలియకుండా.. పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ కి చెప్పకుండా మోడీ సర్కార్ వైసీపీ అధినేత కోసం చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిందని చెప్పడంపై పురందేశ్వరి స్పందించాలని కోరుతున్నారు. ప్రధాని మోడీ.. ఏపీ సీఎం లాబీయింగ్ కి ఒప్పుకునేటంత బలహీనుడా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! అదే నిజమైతే ఐటీ ఎందుకు నేరుగా ఈడీ రంగంలోకి దిగితే సరిపోయేదిగా అని ఎద్దేవా చేస్తున్నారు!
ఏది ఏమైనా… చంద్రబాబుకు ఐటీ నోటీసులు రావడంపై ఎవరు స్పందించకపోయినా బోండా ఉమ స్పందించడం ఒకెత్తు అయితే… ఆ నోటీసులను కూడా జగన్ కి ఆపాదించడం మరొకెత్తు! దీంతో ఇకపై ఆ వర్గం మీడియాకు ఇదే బ్యానర్ ఐటం అయ్యే ఛాన్స్ ఉందని.. ఇక ఈ యాంగిల్ లోనే కథనాలు రాసుకోవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి!