ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక సంచలన విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద కుదుపు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా… అమరావతి పేరు చెప్పి చంద్రబాబు చేసిన అవినీతి ఇదంటూ ఒక వార్త హల్ చల్ చేసింది. ఇందులో భాగంగా.. రాజధాని నిర్మాణం పనుల్లో రూ.118 కోట్లు ముడుపులు అందాయని ఐటీ శాఖ ఆభియోగాలు మోపింది.
రూ. 118 కోట్ల రూపాయల విషయంలో చంద్రబాబు వివరణ సరిగా లేకపోవడంతో.. ఈ మొత్తాన్ని బ్లాక్ మనీగానే పరిగణిస్తామని ఐటీ శాఖ ఉన్నతాధికారులు స్పష్టంగా షోకాజ్ నోటీసులో చెప్పారు. బ్లాక్ మనీయా లేకపోతే ముడుపులా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… చంద్రబాబుకు రూ.118 కోట్లు ముట్టాయన్నది నిజమే అని జనాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
పైగా ఆ కథనంలో ఇచ్చిన వివరాలు.. ఇప్పటికే చంద్రబాబు పీఏకి ఆ మొత్తం సొమ్ము అప్పగించినట్లు ఇచ్చిన వివరణలు స్పష్టంగా తెలిపాయి. అయితే మొదటి నుండి అమరావతి అన్నది పెద్ద కుంభకోణమని జగన్మోహన్ రెడ్డి అండ్ కో అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నదే. ఈ విషయంపై అసెంబ్లీలో అధికారపక్షం ఈ సమయంలో ఎన్నో వివరణలు ఇచ్చాయి.
అవసరమైతే… తాజాగా ఆ అనుమానాలకు ఐటీ శాఖ సమాధానమిచ్చిందంతే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే రూ.118 కోట్లు చంద్రబాబుకు అందాయి అనేందుకు మరో సాక్ష్యం కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం టీడీపీ, దాని అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి ఈ విషయం తెరపైకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. చంద్రబాబుకు ఇబ్బందులు వస్తాయని అనుకున్నపుడల్లా ఎల్లో మీడియా, తమ్ముళ్ళు అసలా విషయాన్ని ప్రస్తావించరు. ఎవరికి వారే మౌనాన్నే తమ బాషగా చేసుకుంటారు. ప్రస్తుతం అదే వైఖరి అవలంభిస్తున్నారు.
దీంతో… ఎవరిక్ వారే తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారంటూ వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. దీంతో…. చంద్రబాబు ఆ 118 కోట్ల వ్యవహారంలో వాస్తవమే ఉన్నట్లుంది.. ఐటీ శాఖ ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇస్తూ, సవివరంగా వివరిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా 46 పేజీల నోటీసులు పంపింది!
మరి చంద్రబాబు ఇప్పటికైనా ఆ విషయంపై స్పందిస్తారా.. విచారణకు సహకరిస్తారా.. లేక అడ్డగోలుగా వాదిస్తూ, తనదైన శైలిలో స్టేలు తెచ్చుకునే పనికి పూనుకుంటారా.. ఐటీశాఖ ఈ విషయంలో ఏ మేరకు గట్టిగా ఉంటుంది? ఏ మేరకు బలంగా నిలబడుతుంది? ఇందులో కేంద్రం నుంచి రాజకీయ శక్తులు ఏమైనా మధ్యలో ఎంటరయ్యే ఛాన్స్ ఉందా అనేది ఆసక్తిగా మారింది.