వేరుపురుగు చేరి వృక్షంబు చెరచు

by Elections are unlikely to take place without government approval
ఏమవుతుంది?  ఇప్పుడేమవుతుంది?  ఆకాశం విరిగి నేలమీద పడుతుందా? భూకంపం వచ్చి భూగోళం  మాయమైపోతుందా?  గతంలో ఏళ్లతరబడి అసలు స్థానిక సంస్థలకు ఎన్నికలే జరగలేదు. అప్పుడేమయింది?  చంద్రబాబు  హయాంలో 2018 లో జరగాల్సిన ఎన్నికలు జరగలేదు.  ఏమైంది?  స్వర్గం కూలి భూమిపై పడిందా?..
 
కొందరు సీనియర్ పాత్రికేయులు, గత యాభై ఏళ్లుగా రాజకీయాలను గమనిస్తున్న పరిశీలకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అవి.  
by Elections are unlikely to take place without government approval
by Elections are unlikely to take place without government approval
నిజమే….తనది రాజ్యాంగ వ్యవస్థ అని, ఎన్నికలు అనే మాట ప్రస్తావిస్తేనే చాలు ప్రభుత్వం మొత్తం తనముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే అని కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వైరకల్పనల్లో మునిగి తేలుతుండవచ్చు.   తన మాటే శాసనం అని ఆయన చిత్తభ్రమలకు లోనవుతుండవచ్చు…కానీ, వాస్తవ ప్రపంచం వేరుగా ఉంటుంది.  
 
రెండు పచ్చజాతి క్షుద్రపత్రికలను భగవద్గీతలుగా ఎంచి జగన్ కు వ్యతిరేకంగా ఒక పాచివంటకాన్ని వండగానే  కొందరు మురిసిపోతుండవచ్చు.  నిమ్మగడ్డ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డ ఉల్కా అనో, చక్రధారి అనో సంబరపడుతుండవచ్చు.  కానీ అనేకానేక శాఖలుగా విస్తరించిన మన రాజ్యాంగ వ్యవస్థలో ఎన్నికల కమీషన్ అనేది ఒక చిన్న రెమ్మ మాత్రమే.   రాష్ట్రప్రభుత్వ ఆమోదం లేకుండా స్థానిక ఎన్నికలు జరగడం అసంభవం.   ఏమవుతుంది?  రేపు నిమ్మగడ్డ కోర్టుకు వెళ్తారు.  ప్రభుత్వానికి లేవా కోర్టులు?  ప్రభుత్వం వెయ్యలేదా పిటీషన్లు?  రోజుకొకటి చొప్పున పదివేలమందితో   ప్రభుత్వం పిటీషన్లు వేయిస్తుంది.    ఆ పిటీషన్లను విచారించకుండా ఏకపక్షంగా కోర్టులు తీర్పు ఇవ్వవు కదా!  ఎన్నికలను అడ్డుకోవాలంటే ప్రభుత్వం ముందు లక్షాతొంభై మార్గాలు ఉన్నాయి.  ఆనాడే గనుక నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించి ఎన్నికలు వాయిదా వేసి ఉన్నట్లయితే ఈరోజు ఆయనకు ప్రభుత్వం తప్పకుండా సహకరించి ఉండేది.  కానీ ఆయన మాత్రం చంద్రబాబు ఆడించే తోలుబొమ్మలా వెన్నెముకలేని వ్యక్తిలా వ్యవహరించారు.  
 
ఇంత చేస్తున్నా చంద్రబాబు, ఆయన ముఠా  తప్ప విజ్ఞత కలిగిన మేధావులు ఎవ్వరూ నిమ్మగడ్డకు  అనుకూలంగా మాట్లాడటం లేదు.  స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే ప్రళయం సంభవిస్తుంది అని ఎవరూ భావించడం లేదు.  నిమ్మగడ్డకు విశ్వసనీయత లేకపోవడమే అందుకు ప్రధాన కారణం.  ఎన్నికల కమీషనర్ గా తనను తప్పించిన తరువాత ఆయన హైద్రాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో ఆర్ధిక ఉగ్రవాదిగా అపఖ్యాతి పాలైన తెలుగుదేశం మాజీ నాయకుడు, ప్రస్తుతం కేసుల భయంతో కాషాయం ముసుగు వేసుకున్న సుజనాచౌదరి, మరొక ముసుగువీరుడు  కామినేని శ్రీనివాస్ లతో రహస్యంగా సమావేశం కావడంతోనే నిమ్మగడ్డ విశ్వసనీయత మంటగలిసిపోయింది.  వారితో కాకుండా ఏ జయప్రకాశ్ నారాయణ్, ఐవైఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎన్నికల కమీషనర్లు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు  లాంటి మేధావులతో సమావేశమై ఏమి చెయ్యాలో చర్చిస్తే ఆయన పట్ల గౌరవభావం ఏర్పడేది.    నిమ్మగడ్డ చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మ అని అందరికీ తెలుసు కాబట్టే మంత్రులు కూడా నిమ్మగడ్డను గడ్డిపోచకన్నా హీనంగా తీసిపారేస్తున్నారు.  
 
ఇక నిమ్మగడ్డ ఏమి చెయ్యగలడు?  ఏమీ చెయ్యలేడు.  కాకపొతే కోర్టులు మరోసారి ప్రభుత్వానికి అక్షింతలు వేస్తాయి.  రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా అని ప్రశ్నిస్తాయి.  ఆ పనిని ఇంతకుముందే కోర్టు చేసి ప్రజల్లో అపకీర్తిని మూటగట్టుకున్నాయి.  కోర్టుల పట్ల విశ్వాసం సన్నగిల్లడానికి ఏమి చెయ్యాలో అవన్నీ జరిగిపోయాయి.  కోర్టులు ఆదేశించినంతమాత్రాన ఎన్నికలు జరుగుతాయని నేను అనుకోవడం లేదు.  కోవిద్ మరోసారి కమ్ముకుంటున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం హెచ్చరిస్తున్నది.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికలు జరుపుతుందని నేను నమ్మను.  ఎన్నికలు జరపడానికి నిరాకరించినంతమాత్రాన ప్రభుత్వాన్ని కోర్టులు రద్దు చెయ్యలేవు.  జగన్మోహన్ రెడ్డి పదవికి వాటిల్లే ముప్పేమీ లేదు.   ఎన్నికల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని సుప్రీమ్ కోర్ట్ చెప్పినప్పుడే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వెయ్యడం తప్పు అని చెప్పినట్లయింది.  ఆ మర్మాన్ని  నిమ్మగడ్డ గ్రహించలేకపోయారు!  
 
అయిదు సంవత్సరాల పాటు  ప్రజల కష్టార్జితం నుంచి వేతనం తీసుకుని, ఒక్క కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక మినహా మరే ఎన్నికా జరపకుండానే పదవికి శుభం కార్డు వేసుకున్న ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చరిత్రకెక్కుతారు.   కొందరి వలన వ్యవస్థలకు ఖ్యాతి వస్తుంది.  వ్యవస్థలవలన మరికొందరికి ఖ్యాతి వస్తుంది.  కొందరి నిర్వాకం వలన వ్యవస్థల ప్రతిష్ట పతనమై పోతుంది.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూడో కోవలోకి వస్తారు!  
 
అడవిలో ఎండిన చెట్టుకు నిప్పు అంటుకుంటే అడవి మొత్తాన్ని దహించి వేస్తుంది.  వ్యవస్థలో ఒక గుణహీనుడు చేరితే వ్యవస్థ మొత్తానికి చేటు కలుగుతుంది!!
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు