అయిననూ, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సిద్ధంగా లేడట.!

2023లో బాలయ్య ముద్దుల తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తాడని ఈ మధ్య నందమూరి బాలక‌ష్ణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే, అందుకు ఏమాత్రం మోక్షజ్ఞ సిద్ధంగా లేడనేది తాజా ఖబర్. మరికొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాడట మోక్షజ్ఞ. ఎప్పుడో మోక్షజ్ఞ ఎంట్రీ షురూ కావల్సి వుంది. కానీ, జరగలేదు. ఇంత ఆలస్యమైనా ఇప్పటికీ ఇంకా మోక్షజ్ఞ మీన మేషాలు లేక్కేస్తుండడం పట్ల బాలయ్య అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మోక్షజ్ఞ తెరంగేట్ం ఆలస్యం కావడానికి గల స్ట్రాంగ్ రీజన్స్‌పై క్లారిటీ లేదు. కానీ, నటన, డాన్స్ తదితర అంశాల్లో మోక్షజ్ఞ ఇంకా సంసిద్ధంగా లేడనేది ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. మరో వైపు అసలు మోక్షజ్ఞకు నటనపై ఆసక్తియే లేదన్న గుస గుస కూడా వినిపిస్తోంది.