అంత్యక్రియలలో మహిళలు ఎందుకు పాల్గొనరు… పాల్గొనక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా ఈ ఆచారాలు పాటిస్తూనే ఉంటాం. మనిషి చనిపోయినప్పుడు కూడా వీటిని మరింత ఎక్కువగా పాటించడం మనం చూస్తూనే ఉంటాం. మనిషి చనిపోయినప్పుడు కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారం తనకు అంతక్రియలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ అంత్యక్రియలలో భాగంగా దింపుడుకళ్లెం వంటి ఆచారాలను నిర్వహిస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. మనిషి చనిపోయిన తర్వాత పూడ్చడమో.. లేక కాల్చడమో చేస్తుంటారు.

ఇదిలా ఉంటే హిందూ సంప్రదాయాల ప్రకారం మహిళలను శ్మశాన వాటికకు రాకుండా.. దహన సంస్కారాల్లో పాల్గొనరు. అయితే అసలు ఈ కార్యక్రమాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులతో పోలిస్తే మహిళలు తొందరగా భావోద్వేగానికి గురవుతారు. దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో భావోద్వేగాలతో మెంటల్ గా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దీంతో మహిళలను దహన సంస్కారాలకు దూరంగా ఉంచుతారు. ఇలా బాగోద్వేగానికి లోనైనప్పుడు కొన్నిసార్లు వాళ్లు కూడా ఆ మంటలలో చిక్కుకొని అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో వారిని అంత్యక్రియలలో పాల్గొననివ్వరు

పూర్వకాలం నుంచి ఎవరి ఇంట్లో అయిన ఓ మనిషి చనిపోతే.. ఆ ఇంట్లో పిల్లల్ని, ముసలి వారిని  చూసుకుంటూ.. ఇళ్లు శుభ్రం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో శ్మశాన వాటికలకు వెళ్లేవారు కాదు. అలాగే మరికొందరు అభిప్రాయం ప్రకారం…దహన సంస్కారాలకు వెళ్లి వచ్చేవారికి భోజనం చేసేవారు. ఇదిలా ఉంటే శ్మశాన వాటికలల్లో దుష్టశక్తులు ఉంటాయని నమ్ముతుంటారు. దీంతో మహిళలకు పెద్ద జుట్టు ఉండటంతో ఆవహించే ప్రమాదం ఉంటుందని నమ్ముతారు. ఆలాగే గర్భం దాల్చిన మహిళలు శ్మశాన వాటికలు వెళ్లడం నిషేధంగా ఉంది హిందూ సంప్రదాయంలో.