Prerna Arora: కొత్త ఉత్సాహంతో ముందుకు..

Prerna Arora: అదృష్ట సంఖ్యగా ఎప్పటినుంచో ఆమె జీవితంలో ప్రత్యేక స్థానంలో నిలిచిన ‘8 ఇవాళ డిసెంబర్ 8వ తేదీ ఆమెకు మరింత శుభాన్ని తీసుకు వచ్చింది. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో, ప్రేరణ అరోరా భారీ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి తమ తదుపరి పాన్-ఇండియా అడ్వెంచర్ చిత్రం అధికారికంగా ప్రారంభించారు. ‘రుస్తమ్’, ‘జటాధరా’ విజయాల తర్వాత, ఇది ప్రేరణ అరోరాకి జీ స్టూడియోస్‌తో మూడవ సహకారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తుండగా, కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించిన ‘జటాధరా’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై టాప్ చార్ట్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. ‘రుస్తమ్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మాన్’, ‘పరీ’ వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న.. కమర్షియల్ సక్సెస్ సాధించిన హిందీ చిత్రాలతో ప్రేరణ అరోరా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుని యువ మహిళా నిర్మాతగా స్థిరపడ్డారు. ఆమె అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టులు కేవలం హిందీ చిత్రసీమలోనే కాక దక్షిణ భారత ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా విశేష ఆదరణ పొందుతున్నాయి.

రాజీనామా| Analyst Ks Prasad About Arnab Goswami on Ram Mohan naidu & Nara Lokesh | Indigo Crisis |TR