ఈ గ్రహ దోషాలు తొలగిపోవాలంటే డబ్బుకు బదులు వీటిని దానం చేస్తే చాలు.. దోషాలన్నీ తొలగిపోతాయి?

సాధారణంగా మన జాతకలో గ్రహాలమార్పులు కారణంగా కొన్ని దోషాలు ఏర్పడడం సర్వసాధారణం ఇలా చాలామంది రాహువు, కేతువు, శని గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించడం దానధర్మాలు చేయడం వల్ల ఈ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.ఇకపోతే ఈ విధమైనటువంటి దోషాలతో బాధపడేవారు ధనం కన్నా కొన్ని రకాల వస్తువులను దానం చేయటం వల్ల ఈ దోష పరిహారం కలుగుతుంది.

శని దోషంతో బాధపడేవారు పేదలకు నల్లని వస్త్రాలు లేదా నల్లని దుప్పటి దానం చేయడం వల్ల బాధ నుంచి బయటపడవచ్చు. ఇలా నల్లని వస్తువులను దానం చేయడం వల్ల శని చల్లని చూపు మనపై ఉండే శని బాధలు తొలగిపోతాయి. కుజదోషంతో బాధపడేవారు ఆహార ధాన్యాలను కాకుండా స్వయంగా ఆ పదార్థాలతో ఆహారం వండి పేదలకు దానం చేయటం వల్ల కుజగ్రహ దోషం నుంచి బయటపడవచ్చు.

ఇకపోతే సూర్యుడు బృహస్పతితో సంబంధం ఉన్నవారు డబ్బుకు బదులు పేదలకు పండ్లను దానం చేయడం మంచిది. అయితే ఇలా దానం చేసేటప్పుడు ఒకే రకమైన పండ్లను దానం చేయడం మంచిది. ఇక ఎవరైతే రాహువు కేతు గ్రహ దోషాలతో బాధపడుతున్నారో అలాంటివారు బట్టలను దానం చేయడం వల్ల ఈ దోష పరిహారం నుంచి బయటపడవచ్చు.ఇక సోమవారం వంటి రోజులలో పాలు దానం చేయటం వల్ల మన మనసులో ఉన్నటువంటి ఆందోళన కంగారు చికాకులనుంచి విముక్తి పొంది ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఇలా డబ్బుకు బదులు ఈ వస్తువులను దానం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి.