మనకి తెలియకుండా చేసే ఈ పనుల వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని తెలుసా..?

ప్రస్తుత కాలంలో ఎంతో మంది ప్రజలు వాస్తు శాస్త్రం పట్ల చాలా నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఏ పని మొదలు పెట్టాలన్న ముందుగా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టేముందు కచ్చితంగా వాస్తు నియమాలను పాటిస్తుంటారు. వాస్తు ప్రకారం ఏ రూమ్ ఎక్కడ ఉండాలి దానిని ఎలా నిర్మించాలి అన్నది నియమాలు తప్పకుండా పాటిస్తారు. ఇంటి లోని కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి, ఆనందం అనేవి వాస్తు శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయి.

 

వాస్తు శాస్త్రం వలన సానుకూల మరియు ప్రతికూల శక్తులు ప్రభావితమై ఉంటాయి. సానుకూల శక్తి ఇంట్లో ప్రశాంతతను, ఆనందం మరియు శ్రేయస్సును అందిస్తుంది. ప్రతికూల శక్తి జీవితంలో అనేక సమస్యలను తీసుకొస్తుంది. ప్రతిదీ వాస్తు శాస్త్రం ప్రకారం చేసిన కూడా ఆ వ్యక్తి పదే పదే విఫలం అవుతుంటాడు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం చేసే కొన్ని పనుల వల్ల ఆర్థిక పురోగతి మందగిస్తుంది. వాస్తు ప్రకారం ఒక వ్యక్తి ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో ఒకసారి తెలుసుకుందాం.

 

సాధారణంగా నేల మీద కూర్చొని భోజనం చేయటం చాలా మంచిది. కానీ కొంతమంది. మంచం మీద కూర్చుని భోజనం చేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో అశాంతి, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

 

దానం అనేది దక్షిణ పుణ్యం ఇస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత పాలు, పెరుగు, ఉల్లిపాయలు, ఉప్పు అనేవి ఎట్టి పరిస్థితులలోనూ దానం చేయకూడదు. సాయంకాలం వేళ వీటిని దానం చేస్తే లక్ష్మి దేవి కి కోపం వచ్చి ఇంట్లో దరిద్రం వస్తుంది.

 

అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత పాత్రలను శుభ్రపరచకుండా అలానే వదిలేస్తారు.వాస్తు శాస్త్రం భోజనం చేసిన ఎంగిలి పాత్రలో అలాగే ఉంచడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలగదు. ఇలా చేయడం వలన ఆ కుటుంబం ఆర్థిక సమస్యలే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మంలో ఎప్పుడు చెత్త బుట్టను ఉంచకూడదు. ఇంటి ముఖ ద్వారం నుండి లక్ష్మీ దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువలన ఇంటి గుమ్మం దగ్గర చెత్తబుట్టను ఉంచడం శ్రేయస్కరం కాదు.