ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే?

సాధారణంగా మనం సంస్కృతి సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వాస్తు శాస్త్రానికి కూడా ఎంతగానో నమ్ముతాము ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేకుండా అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఇల్లు మొత్తం సుఖసంతోషాలతో సకల సంపదలతో ఎంతో సంతోషంగా గడుపుతారని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సిందేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు చెత్త డబ్బా లేకుండా జాగ్రత్త పడాలి. ఇక మన ఇంటి ద్వారం ఉత్తర దిశ వైపు ఉంటేప్రధాన ద్వారం ఎదురుగా సంపూ ఉండడం ఎంతో మంచిది ఇలా సంపులో నీటిని నిల్వ ఉంచడం వల్ల ఇంటిపై నెగటివ్ ఎనర్జీ పడకుండా పూర్తిగా పాజిటివ్ వాతావరణాన్ని కలిగిస్తుంది.ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద మాత్రమే కాకుండా పూజగది వద్ద అలాగే మెట్ల కింద ఎప్పుడూ కూడా చెత్త డబ్బా ఉంచకుండా జాగ్రత్తపడాలి.

ఇక ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ దిశగా ఉంటే ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని వేయాలి. ఈ విధంగా ఆంజనేయస్వామి చిత్రపటం ఇంట్లో ఉండటం వల్ల ఆటంకాలు తొలగిపోయి ఇంట్లో సంతోషాలు సంపద శ్రేయస్సు వృద్ధి చెందుతుంది. ఇక ఇంటి ప్రధాన ద్వారం పశ్చిమం వైపు ఉంటే తప్పనిసరిగా వినాయకుడి విగ్రహం ఉంచాలి. అయితే ఈ వినాయకుడి విగ్రహం ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు ఉండడం ఎంతో మంచిది. ఇక ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.