ఈ 6 ఆరు అలవాట్లు ఉన్నవారు శని దేవుడి ఆగ్రహానికి గురి కాక తప్పదు…?

శని దేవుడిని ప్రజలందరూ న్యాయదేవుడిగా భావించి పూజలు చేసి ప్రార్థిస్తారు. నవగ్రహాలలో కెల్లా శని దేవుడు అత్యంత కీలకమైన వాడు. మనిషి జీవితంలో శని దేవుడు ప్రవేశించాడు అంటే అతని జీవితాంతం బాధలతో గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా మానవులు చేసే కొన్ని పనుల వల్ల శని దేవుడు తీవ్ర అగ్రహానికి గురై వారి మీద తన ఆగ్రహాన్ని చూపిస్తాడు. ఈనేపథ్యంలో శని దేవుడికి కోపం తెప్పించే పనులకు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిదని పండితులు సూచిస్తున్నారు. శని దేవుడి ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి మనం ఏ ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం : మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు సాధారణకు ఊపుతూ ఉంటాము. ఇలా కాళ్లు ఊపడం చాలా అశుభమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతూ కూర్చోవడం వల్ల శని దేవుడు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. తరచూ ఇలా చేసేవారు మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.

* ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయడం :
సాధారణంగా కొంతమంది దారిలో వెళ్లేటప్పుడు నడిచేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తు ఉంటారు. ఈ చెడు అలవాటు కారణంగా జాతకంలో బలహీన పడుతుంది. ఈ చెడు అలవాటు ఉన్నవారు అనేక సమస్యలను బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

* పాత్రలు కడగకుండా వదిలివేయడం :
సాధారణంగా కొంతమందికి భోజనం చేసిన తర్వాత పొట్ట నిండుగా ఉండటంతో ఏ పని చేయబుద్ధి కాదు. ఈ క్రమంలో భోజనం చేసిన పాత్రలను అలాగే ఉంచుతారు. అయితే భోజనం చేసిన వెంటనే పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచడం వల్ల శని దృష్టి ప్రభావం పెరుగుతుంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

* వడ్డీ మీద డబ్బు : సాధారణంగా కొంతమంది ప్రజలు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారు అధిక వడ్డీలు వసూలు చేయటం వల్ల శని దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. ఏదో ఒక రోజు అధిక వడ్డీలు వల్ల సంపాదించిన సంపద మొత్తం పోయి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

* పాదాలను నేలకు రాస్తూ నడవొద్దు :
సాధారణంగా కొంతమంది నడిచేటప్పుడు వారి పాదాలను నెలకు రాస్తూ నడుస్తారు. ఇలా నడవడం చెడ్డ అలవాటు. ఇలా శబ్దం చేస్తూ నడవడం వల్ల శని దృష్టి మనపై పడి అనేక సమస్యలతో ఇబ్బంది పడతారు.

* బాత్రూమ్‌ను మురికిగా ఉంచడం :
ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. అయితే ఇంట్లో ఉన్న ప్రతి భాగం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా స్నానం చేసిన తర్వాత కొంతమంది బాత్రూం శుభ్రం చేయకుండా వదిలేస్తారు. ఇలా బాత్రూం మురికిగా ఉండటం వల్ల వాస్తు దోషాలు పెరగడమే కాకుండా, జాతకంలో చంద్రుడు కూడా అశుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. అలాగే శని దేవుడి ఆగ్రహం వల్ల అనేక బాధలు అనుభవించాలి.