శని దోషం గురించి విన్న వెంటనే మనలో చాలామంది ఆందోళనకు గురవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు. పిల్లలపై తల్లీదండ్రులు ఎలాంటి ప్రేమను చూపిస్తారో శనిదేవుడు కూడా అలాంటి ప్రేమను చూపిస్తాడు. శనిదేవుడిని భక్తితో కొలచడం వల్ల ఎలాంటి అశుభం జరగకుండా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్ఛు.
శని త్రయోదశి రోజున శని దేవుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నువ్వులు, నల్లని వస్త్రంతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్లే సమయంలో పేదవాళ్లకు, భిక్షగాళ్లకు డబ్బు లేదా ఆహారం దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
రెండు మీటర్ల పొడవు ఉన్న నల్లటి వస్త్రం ఇతరులు ఉపయోగించుకునేలా ఉండాలి. ఆ వస్త్రాన్ని ఎవరికైనా దానం చేసి అవతలి వాళ్లు వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. నిరుపేదలకు, పశు పక్షాదులకు దానం చేస్తే పూజ ఫలం దక్కుతుంది. శని భగవానుడిని మనసారా పూజించడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. శని త్రయోదశి రోజున నియమనిష్టలను పాటిస్తే మంచిదని చెప్పవచ్చు.
శని త్రయోదశి రోజున తల స్నానం చేసి మద్యం, మాంసం ముట్టుకోకుండా స్వయంగా శివార్చన చేయడంతో పాటు ఎక్కువసార్లు స్తోత్రాలను పఠించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెట్టడం ద్వారా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ తల్లీదండ్రులకు పాద నమస్కారం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.