సనాతన ధర్మంలో ప్రతీరోజును ఒక తిథితో లెక్కిస్తాం. అయితే ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. తిథి అధిపతి, వ్రత ఫలం గురించి తెలుసుకుందాం..
పాడ్యమి: అధిదేవత – అగ్ని.
వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత – అశ్విని దేవతలు.
వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత – గౌరీ దేవి.
వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత – వినాయకుడు.
వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత – నాగ దేవత.
వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత – సూర్య భగవానుడు.
వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత – అష్టమాత్రుకలు.
వ్రత ఫలం – దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత – దుర్గాదేవి.
వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత – కుబేరుడు.
వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత – విష్ణువు.
వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత – ధర్ముడు.
వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత – రుద్ర.
వ్రత ఫలం – మృత్యుంజయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు – పితృదేవతలు.
వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత – చంద్రుడు.
వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.
కాబట్టి ఆయా తిథుల అధిదేవతలను తెలుసుకున్నాం. ఆయా తిథులలో వారిని పూజించి సత్పలితాలను పొందండి.