ఈ ఒక్క వస్తువును పర్సులో పెడితే చాలు.. లక్ష్మి దేవి అనుగ్రహం మీ పైనే?

సాధారణంగా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉండాలని పెద్ద ఎత్తున అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.ఈ విధంగా లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండడం కోసం కొన్ని రకాల వాస్తు పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. కొన్ని రకాల వస్తువులు మన చెంతన ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని ఎంతగానో విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే మన పర్సులో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే పర్సులో ఈ చిన్న వస్తువులు పెడితే చాలు అమ్మ అనుగ్రహం మన పైనే ఉంటుంది.

కార్తీక మాసంలో శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు పొందడం కోసం శుక్రవారం మన పర్సులో ఒక చిన్న బంగారు నాణెం లేదా వెండి నాణెం ఉంచడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అయితే పర్సులో ఇలా వెండి లేదా బంగారు నాణెం పెట్టే సమయంలో ముందుగా లక్ష్మీదేవిని పూజించుకొని పర్సులో పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి డబ్బుకు కొదువ ఉండదు. అయితే పర్సులో వీటిని పెట్టుకొని ఎలాంటి పనులు చేయకుండా ఉండటం వల్ల డబ్బు వస్తుంది అనుకోవడం మన మూర్ఖత్వం.

మనం చేసే ప్రయత్నాలు చేస్తూ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని ఈ చిన్న పరిహారం పాటించాలి. ఇలా మనం కష్టం చేస్తూ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలని అమ్మవారిని పూజించాలి.అయితే కొంతమంది ఎంత కష్టపడి డబ్బు సంపాదించిన చేతిలో నిలువ ఉండదు. అలాంటి వారు ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అదేవిధంగా ఎవరికైనా మన స్థాయికి తగ్గట్టు వస్త్ర దానం లేదా ఆహార దానం చేయా