నూతన సంవత్సరంలో ధన ప్రాప్తి కలగాలంటే ఈ ఐదు నియమాలు పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి..?

ప్రస్తుత కాలంలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ధనవంతులు అవ్వాలని ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే సిరిసంపదలకు లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తొందరలోనే ప్రజలందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అందువల్ల ఈ నూతన సంవత్సరంలో వారి ఆర్థిక స్థితిగతులు బాగుండాలని ప్రజలందరూ కూడా ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి పూజించే సమయంలో ఈ నియమాలు పాటించాలి.

శంఖం : మన హిందూ సంస్కృతిలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శంఖాన్ని దైవంతో సమానంగా భావించి పూజిస్తూ ఉంటారు. శంఖాలలో వివిధ రకాలుగా ఉంటాయి. వీటిలో కొన్ని శంఖాలు పూరించటానికి ఉపయోగిస్తే మరికొన్ని శంఖాలను పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా వర్ణిస్తారు. శంఖం ఉన్నచోట లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుందని ప్రజల విశ్వాసం. అందువల్ల ఇంట్లో పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తెల్లటి శంఖాన్ని పూజ గదిలో ఉంచి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆ ఇంట్లోకి సిరిసంపదలు వస్తాయి.

స్ఫటిక మాల : స్ఫటికం అనేది శుక్ర గ్రహానికి సంబంధించినది. ఈ స్పటికమాలను గొప్పతనానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందువల్ల లక్ష్మీదేవిని పూజించేటప్పుడు స్పటికమాలతో మాత్రమే లక్ష్మీదేవి మంత్రాలను జపించాలి. ఇలా స్పటికమాలతో లక్ష్మీదేవి మంత్రాలను జపించడమే కాకుండా స్పటిక మాల మెడలో ధరించటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందాలనుకునేవారు ఇంట్లో స్పటిక మాల ఉంచుకోవడం మంచిది.

శ్రీ హరి : ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం మాత్రమే కాకుండా లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువు విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచాలి. శ్రీమహావిష్ణువుకు తులసి మాల సమర్పించి పూజించటం వల్ల ఈ నూతన సంవత్సరంలో ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు కూడా తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

నెయ్యి దీపం : ఇంట్లో ప్రతిరోజు లక్ష్మీ దేవిని పూజించే సమయంలో నెయ్యి దీపం వెలిగించాలి. అయితే ఈ దీపం వెలిగించే ప్రమిద చతుర్ముఖాలతో ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు ఇంట్లో లక్ష్మీదేవి ఎదురుగా నెయ్యి దీపం వెలిగించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది.

గులాబీ సువాసన: లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీ పువ్వులు తామర పువ్వులను సమర్పించి పూజించాలి. గులాబీ పువ్వుల సువాసన లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందువల్ల ప్రతిరోజు గులాబీ రేకులను సమర్పించే లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు.