రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఇవి కనిపిస్తే పొరపాటున కూడా వీటి మీద దాటుకొని వెళ్ళకండి…?

ప్రస్తుత కాలంలో బయటికి వెళ్లాలంటే అందరూ వారి సొంత వాహనాలలోనే బయటికి వెళుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాహనం లేకుండా రోడ్డుమీద నడుచుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో మనం రోడ్డు మీద నడిచేటప్పుడు రోడ్డుపై ఉన్న వస్తువులను గమనిస్తూ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో దిష్టి తీసిన వస్తువులను రోడ్డుమీద వేస్తూ ఉంటారు. పొరపాటున మనం ఆ వస్తువుల మీద దాటుకొని నడవటం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు ఎన్నో ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోడ్డుమీద నడుచుకొని వెళ్లేటప్పుడు ఏ వస్తువులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మానసిక,అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి నిమ్మకాయ కోడిగుడ్డు వస్త్రాలు మరియు ఎర్రని నీటితో దిష్టి తీసి రోడ్డుమీద పారబోస్తూ ఉంటారు. మనం పొరపాటున వీటి మీద నడుచుకొని వెళ్లడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

అలాగే నూతన గృహాలకు దుకాణాలకు దిష్టి తగలకుండా పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు గుజ్జు ముందు భాగంలో వేలాడదీస్తారు. ఇది ప్రజల దడుదృష్టి నిర్వహించి సమస్యలను దూరం చేస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో వీటిని తీసి రోడ్డుమీద పారేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీటికి దూరంగా నడుచుకొని వెళ్లటం శ్రేయస్కరం.

అలాగే ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన చోట ప్రమాదానికి గురైన వ్యక్తికి దిష్టి తీసి అతని బట్టలు రోడ్డుమీద పారేస్తూ ఉంటారు. మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఆ దుస్తుల మీద నడుచుకునే వెళ్లడం వల్ల సమస్యలు మొదలవుతాయి. అందువల్ల పొరపాటున కూడా రోడ్డుమీద పడి ఉన్న దుస్తులపై నడుచుకొని వెళ్లకూడదు.

అలాగే రోడ్డుమీద కనిపించే వెంట్రుకల గుత్తి కూడా అశుభానికి సంకేతం. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే సమయంలో వెంట్రుకల వృత్తి కనిపిస్తే దానికి దూరంగా నడుచుకొని వెళ్లండి.