ప్రతిరోజు ఈ పనులు చేయకపోతే మీ జీవితం అసంపూర్ణం అవుతుంది..?

ప్రపంచంలోని అన్ని దేశాలలో కన్నా మన భారతీయ సంస్కృతికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాలు, వేదాలు మన జీవిత సారాంశాన్ని తెలియజేస్తాయి. పురాణాలు 18 రకాలు. ఈ 18 రకాల పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. విష్ణువుకి ఆయన వాహనమైన గరుడకు మధ్య జరిగిన సంభాషణని ఈ గరుడ పురాణం అని అంటారు. ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి మెరుగైన జీవితం గడపటానికి ఎటువంటి నియమాలు పాటించాలి..అలాగే మరణం తర్వాత ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి కూడా గరుడ పురాణంలో క్లుప్తంగా వివరించారు. వ్యక్తి తన రోజువారి జీవితంలో కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. అలా చేసినప్పుడే అతని జీవితం సంపూర్ణం అవుతుంది. ఒక వ్యక్తి రోజు వారి జీవితంలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం అన్ని దానాలలో కెల్లా అన్నదానం చాలా పవిత్రమైనది. ప్రతిరోజు ఆకలితో ఉన్న ప్రజలకు మన చేతనైనంత సహాయం చేస్తూ వారికి అన్నదానం చేయటం వల్ల సకల పుణ్యాలు లభిస్తాయి. ఇలా చేయటం వల్ల మరణం తర్వాత కూడా మోక్షం పొందవచ్చు. అలాగే ప్రతి వ్యక్తి తన రోజూవారి జీవితంలో ధ్యానం చేయడం చాలా అవసరం. మనిషి ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల ఆ ఒత్తిడి అంతా తగ్గిపోతుంది. ఇలా ధ్యానం చేస్తే అది మన శరీరంపై మెదడుపై ప్రభావం చూపుతుంది. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది.

మన రోజు వారి జీవితంలో చేయవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మనం ఇంట్లో ఆహారం వండిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముందుగా భోజనం పెడుతూ ఉంటారు. అలా కాకుండా మనం తయారుచేసిన భోజనాన్ని ముందుగా కొంచెం దేవుడికి నైవేద్యంగా పెట్టి మరి కొంచెం మూగజీవాలకు మొదటగా పెట్టాలి ఆ తర్వాతనే ఇంట్లో ఉన్న వాళ్లు తినాలి. ప్రతిరోజు ఇలా మనం వండిన ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి కొంచెం మూగజీవాలకు పెట్టడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.