తరచూ తలనొప్పి సమస్య వేధిస్తోందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సమస్య దూరమవుతుందట!

gas-headache1

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో వేధించే ఆరోగ్య సమస్యలలో తలనొప్పి ఒకటి కాగా చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తలనొప్పికి ట్యాబ్లెట్స్ కు బదులుగా ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. ఒత్తిడి, అలసట వల్ల కూడా కొన్ని సందర్భాల్లో తలనొప్పి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు కొంతమందిలో తలనొప్పికి కారణమవుతాయి.

బిజీ లైఫ్ స్టైల్, ఆందోళన కూడా కొన్ని సందర్భాల్లో తలనొప్పికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం 200కు పైగా తలనొప్పులు ఉండగా ఒత్తిడి, అజీర్ణం, గ్యాస్ట్రిక్‌, మలబద్ధకం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలనొప్పికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఎసిడిటీ, స్టఫ్డ్ సైనస్, నిద్ర లేమి కూడా తలనొప్పికి కారణమయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. సోంపు గింజలు, ధనియాలు, జీలకర్ర నీటిలో వేసి మరిగించి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచిది.

ఒత్తిడి, నిద్రలేమి వల్ల తలనొప్పి వేధిస్తే మరి కొంతమందిని తలనొప్పి వేధించే అవకాశాలు అయితే ఉంటుంది. గోరువెచ్చని నూనెతో తలకు మర్ధనా చేయడం ద్వారా తలనొప్పి తగ్గే అవకాశాలు అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్యాక్టిరియల్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కొన్నిసార్లు తలనొప్పి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మైగ్రేన్ సమస్య వేధిస్తుంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిద్.

లావెండర్‌ నూనె మైగ్రేన్ సమస్యను సులువుగా చెక్ పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగా చేయడం, సమయానికి నిద్రపోవడం, రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగడం, మసాలా అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం, టీ కాఫీలకు దూరంగా ఉండటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.