తలనొప్పి సమస్య వెంటాడుతున్న… ఈ ఇంటి చిట్కాతో తలనొప్పి చిటికెలో మాయం!

headache-today-160708-tease

సాధారణంగా వచ్చే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి మనలో చాలామంది ట్యాబ్లెట్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే టాబ్లెట్లను ఎక్కువగా వినియోగించడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి, అలసట, నీరసం డిహైడ్రేషన్ వంటి అనేక సమస్యల వల్ల తరచూ తలనొప్పి సమస్య మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి మన ఇంట్లో కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. దీనివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.

తలనొప్పి సమస్య తలెత్తినప్పుడు కాంతి తక్కువగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెలుతురు ఎక్కువగా ఉంటే నిద్రకు ఆటంకం కలిగి తలనొప్పి సమస్య మరింత తీవ్రమవుతుంది. గోరువెచ్చని పాలల్లో నిమ్మరసం కలుపుకొని సేవిస్తే తలనొప్పి సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. తలనొప్పిని తగ్గించడంలో యాకలిప్టస్ ఆయిల్ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. కావున తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు గాబారపడకుండా నుదిటిపై యాకలిప్టస్ ఆయిల్ తో సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తలనొప్పిగా ఉన్నప్పుడు వెల్లుల్లి తో కషాయం చేసుకొని ఒక టేబుల్ స్పూన్ సేవిస్తే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.అలాగే కాఫీ,టీ వంటి పానీయాలు మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచడంలో సహాయపడతాయి. కావున తలనొప్పిగా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి కాఫీ, టీ నీ తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది
గోరువెచ్చని పాలలో చిటికెడు రాతి ఉప్పు వేసుకుని సేవిస్తే తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తరచూ తలనొప్పి సమస్యతో బాధపడేవారు రోజువారి ఆహారంలో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం ,మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కొబ్బరి నూనెతో తలపై సున్నితంగా మర్దన చేసుకుంటే రక్తనాళాలు, మెదడు కణాలు శాంతపరిచి తీవ్రమైన తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.