సాధారణంగా మన ఇంట్లో ఉన్న దేవుడి చిత్రపటాలు విగ్రహాలు కొన్ని సందర్భాలలో పగిలిపోతూ ఉంటాయి. అంతేకాకుండా విగ్రహాలు కూడా అరిగిపోతూ ఉంటాయి. అయితే ఇలా పూజకు పనికి రాని దేవుడి విగ్రహాలను, ఫోటోలను ఏం చేయాలో తెలియక గుళ్ళల్లో, చెట్టు కింద పెట్టి వెళ్లిపోతుంటారు. అయితే ఇలా చేయటం క్షమించరాని పాపమని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్నంతకాలం భక్తితో పూజలు చేసి పగిలిపోయిన తర్వాత పూజకు పనికిరాని ఎలా రోడ్డు పక్కన పడేయడం మంచి పద్ధతి కాదని, ఇలా చేయటం వల్ల హిందూ మతం గురించి ఇతర మతస్థులు చులకన చేసి మాట్లాడుతున్నారని పండితులు వెల్లడిస్తున్నారు.
ఇలా ఇంట్లోనే దేవుడి పటాలు విగ్రహాలు పగిలిపోయినప్పుడు వాటి గుడిలో కానీ రోడ్డు పక్కన ఉన్న చెట్ల కింద కానీ పెట్టకుండా వాటిని అగ్నిలో వేసి ఆహుతి చేయాలి. అయితే దేవుడి ఫోటోలను ఇలా వంటలలో వేసి కాల్చడం మంచిదేనా అని చాలామందికి అనుమానం ఉండవచ్చు. అంతేకాకుండా దేవుడి ఫోటోలను మంటలలో వేసి కాల్చడం వల్ల పాపం చుట్టుకుంటుందని చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అగ్నిదేవుడు సర్వభక్షకుడు. అలాగే అన్ని వేలల్లోను పునీతుడు. అందువల్ల పవిత్రమైన ఆజ్ఞకి దేవుడు చిత్రపటాలను ఆహుతి ఇవ్వడం వల్ల ఎటువంటి తప్పు లేదు .
అయితే ఇలా పూజకు పనికిరాని దేవుడి చిత్రపటాలు, విగ్రహాలు మంటలలో ఆహుతి చేయటానికి భయపడేవారికి మరొక మార్గం కూడా ఉంది. పనికి రాని దేవుడి విగ్రహాలు, ఫోటోలు పారుతున్న నీటిలో కూడా నిమజ్జనం చేయవచ్చు. ఇలా చేయటం వల్ల కూడా ఎటువంటి పాపం ఉండదు. అయితే ఇలా వీటిని అగ్నికి ఆహుతి ఇవ్వడం,లేదా నీటిలో నిమజ్జనం చేయటానికి ముందు ఒక శ్లోకం చెప్పాలి. ” గుచ్చ గుచ్చ శ్రేష్ఠ స్వస్తాన పరమేశ్వర ” అని చెప్పి వాటిని నమస్కారం చేసి ఆ తరువాత వాటిని అగ్నిలో వేయాలి..లేదా నీటిలో నిమజ్జనం చేయాలి.