ఇంస్టాగ్రామ్ వినియోగదారులకు శుభవార్త.. అందుబాటులోకి వచ్చిన బ్రాడ్ కాస్టింగ్ చానల్స్..!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం రోజురోజుకీ పెరిగిపోతుంది యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఆప్స్ ద్వారా అందరూ తమ టాలెంట్  నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ తమ టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా షార్ట్‌ వీడియోలు, బ్లాగులతో పెయిడ్‌ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం బిలియన్ ప్లస్ డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లాగే ఇన్‌స్టా తమ కస్టమర్లను అలరించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను  అందుబాటులోకి తీసుకువస్తుంది.

 

 

ఇంస్టాగ్రామ్ ద్వారా యూజర్ లు కేవలం ఫోటోలు అప్‌లోడ్ చేయడం మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేటర్లుగా కూడా మారొచ్చు. అంతేకాకుండా క్రియేటర్లుగా మారిన వాళ్లు ఇన్‌స్టా రీల్స్‌ చేస్తూ ప్రతినెలా అధిక మొత్తంలో ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఆదాయం పొందే వారి కోసం  తాజాగా ఇన్‌స్టా ఒక మేజర్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్‌స్టా తమ క్రియేటర్ల కోసం బ్రాడ్‌కాస్టింగ్‌ ఛానెల్స్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్‌ ద్వారా క్రియేటర్లు కొన్ని ఛానెల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. వాటి ద్వారా అభిమానులు, ఫాలోవర్స్‌తో కాంటాక్ట్ అయ్యేందుకు, వారితో సమాచారం పంచుకునేందుకు వీలుంటుంది.

 

దీని ద్వారా టెక్ట్స్, వీడియో, ఫోటోలు, వాయిస్ నోట్స్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వవచ్చు. అలాగే అభిమానులు కూడా వారి అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఈ ఛానెల్స్ గురించి సింపుల్‌గా చెప్పాలి అంటే.. టెలిగ్రామ్‌లో ఎలా అయితే పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయో.. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఛానెల్స్ పేరిట పబ్లిక్ చాట్ ఉంటుంది. టెలిగ్రామ్ తరహాలోనే క్రియేటర్లు చేసే ఈ ఛానెల్స్‌లో మీరు కూడా జాయిన్ కావచ్చు. అందులో సమాచారాన్ని అందరితో పంచుకోవచ్చు. అయితే ఇందులో మెసేజ్‌కి మాత్రమే  రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ రిప్లే ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది జుకరబర్గ్ సహా అమెరికాలో ఉన్న కొందరు క్రియేటర్లకు మాత్రమే టెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించారు. త్వరలోనే అందరు క్రియేటర్ల కోసం ఇది అందుబాటులోకి రానుంది.