ప్రస్తుత స్మార్ట్ ఫోన్ వాడకం అందరికీ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కేవలం ఫోన్లు, మెసేజ్ లు మాత్రమే కాకుండా ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతోంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వారి సమయంలో ఎక్కువ భాగం సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తూ గడుపుతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఒకటైన ఫేస్‌బుక్ ఎక్కువ మందిని ఆకట్టుకుంటోంది. అయితే దీని వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం ఉంది. అందువల్ల దీనిని ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే కొన్ని సందర్భాలలో ఫేస్బుక్ నుండి లాగౌట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో ఫేస్బుక్ అకౌంట్ లో ఉన్న ఫోటోలు వీడియోలు డిలీట్ అవుతాయని చాలామంది భయపడుతూ ఉంటారు.
ముఖ్యంగా పరీక్షల సమయంలో యువతి యువకులు కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఫేస్బుక్ అకౌంట్ నుండి లాగౌట్ అవుతారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఉన్న వారికి సంబందించిన ఫొటోలు , వీడియోలు డిలీట్ అయ్యిపోతాయని అని బాధపడుతుంటాం. ఇలాంటి వారి కోసం ఫేస్ బుక్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫొటలు, వీడియోలను ఇతర ప్లాట్ ఫామ్స్‌కు బదిలీ చేసే అవకాశాన్ని కల్పించింది. ఫేస్బుక్ యూజర్లు తాము అప్ లోడ్ లేదా డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోలను ఫేస్బుక్ అకౌంట్ నుండి డైరెక్ట్‌గా గూగుల్ ఫొటోస్‌కు సెండ్ చేసే అవకాశం కల్పిస్తుంది. అయితే ఫేస్ బుక్ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఫొటోస్‌ను ఎలా బదిలీ చేయాలో? ఇప్పుడు తెలుసుకుందాం.
• మొదటగా మీ మొబైల్ లో నుంచి ఫేస్ బుక్‌లోకి లాగిన్ అవ్వాలి.
• ఇక ఇప్పుడు టాప్‌లో రైట్ సైడ్ ఉన్న ప్రొఫైల్ ఆప్షన్‌ను క్లిక్ చేసి సెట్టింగ్స్ పేజీకు వెళ్లాలి.
• అక్కడ సెట్టింగ్ కింద ఎడమ వైపు ఉన్న ఫేస్ బుక్ సమాచారంపై క్లిక్ చేయాలి.
• ఇక అక్కడ ట్రాన్సర్ కాపీ ఆఫ్ యువర్ ఇన్‌ఫర్మేషన్ అనే ఆప్షన్‌కు ముందు ఉన్న వ్యూ బటన్‌పై క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత గూగుల్ ఫొటోస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
• ఆ తరువాత పేజీలో ఏం బదిలీ చేయాలనే ఎంపికపై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.
• ఆ తర్వాత కనెక్ట్ బటన్‌పై క్లిక్ చేసి గూగుల్ ఎకౌంట్ లాగిన్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
మొత్తం ఈ ప్రాసెస్ చేశాక స్టార్ట్ ట్రాన్స్‌ఫర్ బటన్‌పై క్లిక్ చేయాలి.
• ఇలా చేయటం వల్ల మీ ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోలకు అనుసంధానం అవుతాయి.
