ఇంట్లో పొరపాటున కూడా ఈ ఐదు ఫోటోలను అస్సలు పెట్టకండి.. పెడితే అంతే సంగతులు?

సాధారణంగా మనం ఇంటి అలంకరణలో భాగంగా వివిధ రకాల పక్షులు జంతువుల ఫోటో ప్రేమ్ లను ఇంట్లో వేలాడదీస్తూ ఉంటాము. ఇలా చాలామంది వారికి నచ్చిన జంతువుల ఫోటోలను ఇంట్లో అతికిస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల జంతువుల ఫోటోలు ఇంట్లో ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే పొరపాటున కూడా ఇంట్లో ఈ ఐదు రకాల ఫోటోలను ఇంట్లో పెట్టుకున్నట్లు అయితే సమస్యలు తప్పవని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 

మరి ఇంట్లో పెట్టకూడని ఆ ఐదు ఫోటోలు ఏంటి అనే విషయానికి వస్తే…మన ఇంట్లో ఎప్పుడూ ఉదయించే సూర్యుడు ఫోటో ఉండాలి కానీ అస్తమించే సూర్యుడి ఫోటో ఎట్టి పరిస్థితులలో పెట్టుకోకూడదు. ఇది మీ విజయం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంట్లో ఏడుస్తూ ఉన్నటువంటి చిన్నారి ఫోటోలను పెట్టుకోకూడదు.ఇలా ఏడుస్తున్న చిన్నారి ఫోటోలు ఉండటం వల్ల అది కుటుంబ సభ్యుల మధ్య వివాదానికి కారణం అవుతూ ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

 

హింసాత్మకమైన జంతువుల ఫోటోలు కూడా ఇంట్లో ఉండకూడదు.ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి అనుకునేవారు పొరపాటున కూడా క్రూరమైన జంతువుల ఫోటోలను ఇంట్లో అలంకరించకూడదు. ఇక ప్రవహించే నీటి ప్రవాహం ఉన్న ఫోటోలను కూడా ఇంట్లో పెట్టకూడదు ఇలా చేయటం వల్ల దురదృష్టం మనల్ని వెంటాడుతూ మన సంపద కూడా అలాగే ప్రవహిస్తూ బయటకు వెళ్ళిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మునిగిపోతున్న పడవల ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలాంటి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల మీ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.