నెమలి పించం ఇంట్లో ఉంచడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా.. ఈ దోషాలన్నీ మటుమాయం?

సాధారణంగా హిందువులు ఆచార సంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతుంటారు.ఈ క్రమంలోనే ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్న వాస్తు పరిహారాలను పాటించి వాస్తు దోషాల నుంచి విముక్తి పొందుతారు.ఈ క్రమంలోనే చాలామంది మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోవడానికి ఇంట్లో కొన్ని రకాల వస్తువులను అలంకరించుకుంటూ ఉంటారు. ఇలా అలంకరించుకునే వాటిలో నెమలి పించం ఒకటి.

శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ప్రీతికరమైన నెమలి పించం ఇంట్లో ఉండటం వల్ల మన ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. మన ఇంట్లో అన్నీ కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా నెమలి పించం మన ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు ఏమాత్రం కోరత ఉండదు.ఇలా మనం కష్టపడుతున్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లో నెమలిపించం ఉంచడం వల్ల డబ్బు ఉండదు.

ఇక ఎవరి జాతకంలో అయితే రాహు ప్రభావం ఉంటుందో అలాంటివారు నెమలి పించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల రాహు దోషం తొలగిపోతుంది. ఇలా దోష పరిహారానికి నెమలి పించం ఎంతో కీలకంగా ఉంటుందని చెప్పాలి. పిల్లలు చదువుతున్న గదిలో నెమలి పించం ఉండటం వల్ల పిల్లలలో ఏకాగ్రత పెరిగే చదువుపై శ్రద్ధ చూపుతారు.ఇలా పలు రకాల వాస్తు దోషాలను మాత్రమే తొలగించడమే కాకుండా మన ఇంటి పై ఎలాంటి చెడు ప్రభావం కలగకుండా ఉంచడానికి నెమలి పించం ఎంతో దోహదపడుతుంది.