సంతాన భాగ్యం కలగాలంటే వాస్తు ప్రకారం ఈ రెండు వస్తువులు ఇంట్లో ఉంటే చాలు?

vastu-e1645523218438

సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు కొందరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండగా, మరి కొందరు సంతాన లేమి కారణంగా బాధపడుతూ ఉంటారు అయితే ఇలా సంతానం లేని వారు సంతానం కోసం ఎన్నో రకాల పూజలు హోమాలు రకాలు చేస్తూ ఉన్నప్పటికీ సంతాన భాగ్యం మాత్రం కలగదు.అయితే సంతానం లేక బాధపడే దంపతులు సంతానం కలగాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు వస్తువులు ఇంట్లోకి తీసుకురావడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

సంతానలేమి సమస్యతో బాధపడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి పించం, కామధేనువును ఇంట్లోకి తీసుకురావటం వల్ల సంతాన యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నెమలి పించం కామదేనువు రెండూ కూడా శ్రీకృష్ణుడిని చూచిస్తాయి కనుక ఈ రెండు వస్తువులను ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాకుండా సంతాన సమస్యలతో బాధపడే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది.

సంతానం కోసం ఎదురుచూసే దంపతులు పూజగదిలో ఆగ్నేయ దిశ వైపు నెమలి పించం పెట్టి పూజించాలి అలాగే ఉత్తరం లేదా తూర్పు దిశ వైపు కామదేనువు విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడే వారు కూడా ఈ రెండు వస్తువులను ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇక వ్యాపారాలలో అభివృద్ధి చెందాలనుకునే వారు కూడా ఈ వస్తువులను వ్యాపారాలు చేసే చోట పెట్టుకోవడం ఎంతో మంచిది.