పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 158 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను కోరుతుండటం గమనార్హం. మార్చి నెల 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 158 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటంతో నిరుద్యోగులకు ఒకింత భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి నెల 30వ తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 9000 రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.
విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ నెల 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది.