భోగి పండుగ రోజున భోగిమంటలు వేయడానికి గల పరమార్థం ఏమిటో తెలుసా..?

ఈ ఏడాది జనవరి 14వ తేదీన ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. తెలుగు ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దేశ విదేశాలలో ఉన్న ప్రజలందరూ సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. మకర సంక్రాంతి కి ఒక రోజు ముందు భోగి పండుగ జరుపుకుంటారు. ఈ భోగి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. భోగి పండుగ రోజున ప్రజలందరూ లోగిళ్ళ ముందు భోగి మంటలు వేసుకుంటారు. అయితే ఇలా భోగి మంటలు వేయటానికి కూడా ఒక కారణం ఉంది.

భోగి పండుగ రోజున తెల్లవారుజామున చలి కాచుకోవటానికి భోగి మంటలు వేస్తారని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. కానీ భోగి మంటల వెనుక ఒక ఆచారం ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. భోగి అనే పదాన్ని భగ అనే పదం నుండి తీసుకోబడినది. భగ అంటే మంటలు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి పాతాళ రాజుగా ఉండమని ఆదేశిస్తాడు. సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని బలి చక్రవర్తికి వరమిచ్చాడు. ఇలా బోగి పండుగ రోజున బలి చక్రవర్తిని ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని పురాణలు చెబుతున్నాయి.

సంక్రాంతి పండుగ ధనుర్మాసం లో వస్తుంది. అందువల్ల ధనుర్మాసం మొత్తం పేడ తో గొబ్బెమ్మలు చేసి ఇంటి ముందు పెడతారు. ఈ గొబ్బెమ్మలను బోగి పండుగ రోజున భోగీ మంటల్లో వేస్తారు. ఇలా గొబ్బెమ్మలు భోగిమంటల్లో వేసి కాల్చటం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశించిపోయి గాలి శుభ్రం అవుతుంది. ఈ గాలిని పీల్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా స్వచ్ఛమైన గాలిని పిల్చడం వల్ల చలికాలంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ల భారీ నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే ఈ భోగిమంటల్లో రావి, మేడి మామిడి చెట్ల బెరడు కూడా వేస్తారు. ఎలా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు.