ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా… కర్పూరంతో ఇలా చేస్తే చాలు ఇక డబ్బే డబ్బు!

సాధారణంగా మనం ఎంత కష్టపడి డబ్బు సంపాదించాలని చూసిన ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చినది వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా రేయి పగలు అని తేడా లేకుండా కష్టపడినప్పటికీ డబ్బు నిలవకుండా ఉంటే కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కర్పూరంతో ఏం చేయాలి అనే విషయానికి వస్తే…

ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేయాలి.అనంతరం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజ చేసిన అనంతరం ఐదు కర్పూర బిల్లలను ఎర్రగుడ్డలో కట్టాలి.ఇలా మూట కట్టిన కర్పూర బిల్లలు లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి అనంతరం దీప ధూపాలతో వస్త్రాన్ని పూజించాలి. ఇలా పూజిస్తున్న సమయంలో తమకు ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండాలని ప్రార్థించాలి.

ఈ విధంగా పూజ చేసిన అనంతరం కొద్దిసేపటి తరువాత మనం కర్పూర బిల్లలను కట్టిన మూట తీసుకెళ్లి ఎక్కడైతే డబ్బు నిలువ చేసుకుంటామో ఆ ప్రాంతంలో పెట్టాలి.ఇంట్లో బీరువాలో అయినా లేదా వ్యాపారం చేసే చోట అయినా కూడా ఈ కర్పూరం కట్టినటువంటి మూటను పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా ఉండటమే కాకుండా కాస్త ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది.