ఆవాల ఆకులతో కలిగే క్రేజీ లాభాలివే.. ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చట!

ఆవాల ఆకుకూరను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఎముకలు బలంగా మారుతాయి మరియు గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. ఆవాల ఆకుకూరలలో ఉండే ఫైబర్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, బీటా-కెరోటిన్ వంటివి మూత్రాశయం, కడుపు, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, అండాశయ క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి.

ఆవాల ఆకుకూరలలో విటమిన్ సి, మైక్రో న్యూటియంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. విటమిన్ కె, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎముకలను బలంగా చేస్తాయి. ఆవాల ఆకుకూరలలో ఉండే విటమిన్ కె, ఫైబర్ గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.

ఆవాల ఆకుకూరలు జీర్ణవ్యవస్థలో పిత్త ఆమ్లాలను బంధించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవాల ఆకుకూరలను తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఆవాల ఆకుకూరలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆవాల ఆకుకూరలు సహజమైన డీకంజెస్టెంట్‌గా పనిచేస్తాయి.

ఆవాల ఆకుకూరలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. సలాడ్లలో, సూపులలో, స్టీవ్స్‌లలో వేసి తినవచ్చు. బంగాళాదుంపలతో కలిపి పరోటాలు, ఇతర వంటకాలలో ఉపయోగించవచ్చు. ఆవాల ఆకుకూరలను మైక్రో గ్రీన్స్ లాగా తయారు చేసుకోవచ్చు. ఆవాల ఆకుకూరలను ఇన్ని వేర్వేరు రకాలుగా ఉపయోగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.