లక్ష్మీ కటాక్షం ఉండాలంటే చేయాల్సిన పనులివే.. చీకటి పడ్డాక చేయొద్దంటూ?

మనలో చాలామంది డబ్బు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. కొంతమంది సంపాదించిన డబ్బును సులువుగా పొదుపు చేస్తే మరి కొందరు మాత్రం సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ నిజ జీవితంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే మనం కొన్ని పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం మనపై ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు.

ముఖ్యంగా ఆడవాళ్లు లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే కొన్ని పనులు తప్పక చేస్తే మంచిది. రాత్రి సమయంలో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం చేయకూడదు. ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండదు. పగలు మాత్రమే దుస్తులు ఉతక్డం లేదా ఆరేయడం చేస్తే మంచిదని చెప్పవచ్చు. రాత్రి సమయంలో చీపురుతో ఇంటిని ఊడవటం లాంటి పనులు చెయ్యడం కూడా మంచిది కాదు.

రాత్రి సమయంలో ఇంటిని ఊడ్చితే కొత్త కష్టాలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాత్రివేళలో జుట్టు, గోళ్లు కత్తిరించడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ఎవరైతే ఉప్పు, పంచదార, పసుపు, పాలు దానం చేస్తారో వాళ్ల ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. రాత్రి సమయంలో వంటగదిలో పాత్రలు శుభ్రం చేయకుండా అలాగే ఉంచకూడదు. ఈ విధంగా చేయడం ద్వారా కూడా దరిద్రం పట్టుకునే ఛాన్స్ అయితే ఉంది.

జడ వేసుకోకుండా ఉన్నా, జుట్టు విరబోసుకున్నా కూడా దరిద్రం పట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ పనులు చేయడం ద్వారా ఎన్నో నష్టాలు, ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని భావించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.