వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రజలలో చాలామంది భయాందోళనకు గురవుతూ ఉంటారు. వేసవికాలంలో అందం, ఆరోగ్యం సొంతం కావాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవి కాలంలో బాడీని తేమగా ఉంచుకోవడం, హీట్ నుంచి కాపాడుకోవడం కోసం చాలా మంది పళ్ల రసాల వైపు ఆసక్తి చూపించడం జరుగుతుందనే సంగతి తెలిసిందే.
కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ వంటి పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి కొబ్బరి నీరు చాలా మంచి ఎంపిక కాగా కొబ్బరి నీళ్లు త్రాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సహజంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
సీజన్‌లతో సంబధం లేకుండా అన్ని కాలాల్లో పుచ్చకాయ లభించే ఛాన్స్ ఉండగా ఇందులో దాదాపు 92 శాతం నీరే ఉంటుందని చెప్పవచ్చు. చల్లదనం, హైడ్రేషన్ కోసం పుచ్చకాయ తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ తీసుకుంటే విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
భారతీయ సాంప్రదాయక ఆహారంలో మజ్జిగ తప్పనిసరిగా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాక దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మజ్జిగకి ఉప్పు, జీలకర్ర కలిపి తాగితే.. వేడి తగ్గుతుంది, జీర్ణక్రియ పెరుగుతుందని చెప్పవచ్చు. నిమ్మరసం, తాజా పండ్లు తీసుకోవడం ద్వారా కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.