తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఇంత లాభమొస్తుందా?

మనలో చాలామంది తాబేలు ఉంగరం గురించి ఏదో ఒక సందర్భంలో విని ఉంటారు. తాబేలు ఉంగరం ధరించే వాళ్లు కొన్ని విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎవరైతే ఈ ఉంగరం ధరిస్తారో వాళ్లకు విధికి మార్గం తెరుస్తుందని పండితులు చెబుతున్నారు. తాబేలు ఉంగరం చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎవరైతే ఈ ఉంగరం ధరిస్తారో వాళ్లపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

 

ప్రతికూల శక్తిని తొలగించడంలో ఈ ఉంగరం సహాయపడుతుంది. మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీని పెంచడంలో ఈ ఉంగరం తోడ్పడుతుంది. ఈ ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం చేకూరే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉంగరం ధరించిన వ్యక్తుల కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వెండి లోహంతో తయారు చేసిన తాబేలు ఉంగరం ధరిస్తే మంచిది.

 

కుడి చేతి వేలికి ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. ఒకవేళ ఎడమచేతి వేలికి ఈ ఉంగరం ధరిస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉండదు. తాబేలు తల ఎదురుగా ఉండేలా ధరించాలి. కుడి చెయ్యి చూపుడు వేలు, మధ్య వేలుకు ఉంగరం ధరించడం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

ఈ ఉంగరం కొన్ని సందర్భాల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంలో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. జ్యోతిష్యుల సలహా లేకుండా ఈ ఉంగరం ధరించడం మంచిది కాదు. మేషం, కర్కాటకం, వృశ్చికం ,మీనం రాశుల వాళ్లు మాత్రం ఈ ఉంగరాలను ధరించకూడదు. తాబేలు ఉంగరం ధరించే వాళ్లు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.