‘ధడక్’ కలెక్షన్ ల జోరు…తొలి వీకెండ్ కలెక్షన్స్

ధడక్ చిత్రం తొలి రోజున రూ.8 .71 కోట్లు వసూలు చేసింది.కరణ్ జోహార్ కొత్త వారితో రూపొందించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రాన్ని కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రం శనివారం రోజున 11.04 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజున కలెక్షన్ల జోరు కొనసాగింది. ఆదివారం రోజున 13.93 కోట్లు వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.33.67 కోట్లు సాధించింది.చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టడం పై కరణ్ జోహార్ తన ట్విట్టర్ ఖాతాలో సంతోషాన్ని వ్యక్తం చేశారు.