Mahavatar Narasimha: అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ ఈ మూవీని నిర్మించారు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ విష్ణువు అవతారలపై యానిమేషన్ సినిమాలను మొదలుపెట్టగా అందులో మొదటి సినిమాగా మహావతార్ నరసింహ జూలై 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ సోషల్ మీడియాలో అప్పటినుంచి ఈ సినిమా పేరు మారుమోగుతుంది. మరి ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మూవీని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా,హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఆడియన్స్ కి మహావతార్ నరసింహ సినిమా ఫుల్ గా నచ్చేసింది.
యానిమేషన్ సినిమా అయినా, భక్తి సినిమా అయినా ఒక పవర్ ఫుల్ కమర్షియల్ సినిమా చూసిన అనుభవం ఇచ్చారు. అందరికి తెలిసిన భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథే అయినా ప్రేక్షకులకు గూస్ బంప్స్ ని తెప్పించారు. మరి ముఖ్యంగా సినిమా చివరి అరగంట అయితే ప్రతి షాట్ కి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అలాగే మహావతార్ నరసింహ సినిమా డైలీ కలెక్షన్స్ కూడా అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కేవలం 6 కోట్లతో తెరకెక్కించగా ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ మేకర్స్ తెలిపారు. అనగా ఆల్మోస్ట్ 25 కోట్లకు పైగా వచ్చింది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమాకు 20 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్ కేవలం వారం రోజుల్లోనే వచ్చాయి. మొదటి రోజు సైలెంట్ గా రిలీజయిన మహావతార్ నరసింహ రెండో రోజు నుంచి మౌత్ టాక్ తోనే దూసుకుపోయింది. ఈ సినిమా థియేటర్స్ లో ఇంకా ఆడుతోంది. థియేటర్ల లోనే ఈ రేంజ్ లో కలెక్షన్ లను రాబట్టిన ఈ సినిమా ఓటీటీ మరింత ఎక్కువ కలెక్షన్ లను సాధిస్తుంది అని మూవీ మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
