‎Mirai: బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న మిరాయ్ కలెక్షన్స్.. ఐదు రోజుల్లోనే ఏకంగా అన్ని కోట్లు!

‎Mirai: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిరాయ్. తేజా సజ్జా ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే తాజాగా విడుదల అయిన బాక్సాఫీస్ దగ్గర మిరాయ్ సినిమా జోరు ఆగడం లేదు. రోజురోజుకి ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజే ఏకంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాట్టి సత్తా చాటింది.

‎ఈ విషయాన్ని మిరాయ్ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉండాలి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వరుసగా రెండు వంద కోట్ల సినిమాలు చేసిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు హీరో తేజా సజ్జా. కాగా మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. అశోకుడు రాసిన 9 గ్రంధాల గురించి ఈ కథ సాగుతుంది. ఆ గ్రంధాలను దక్కించుకోవాలన్న ఆశను హీరో ఎలా అడ్డుకున్నాడు అనేది మిరాయ్ కథ.



‎ దానికి ఫాంటసీ అడ్వెంచర్ ఎలిమెంట్స్ ను మేళవించి యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇక క్లైమాక్స్ లో శ్రీరాముడి ఎలిమెంట్ ను ఇంప్లిమెంట్ చేసిన విధానం, దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా రాములవారి ఎంట్రీలకి థియేటర్స్ మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మోత మోగిపోతున్నాయి. అంతలా ఆడియన్స్ ను కనెక్ట్ చేశాడు కార్తీక్ ఘట్టమనేని. ఇక సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అంత తక్కువ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ అందించడం ప్రత్యేకంగా మారింది. ఆ విషయంలో కార్తీక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక నటీనటుల యాక్టింగ్, టెక్నీషియన్స్ పనితనం, మ్యూజిక్, ఇలా ప్రతీ ఎలిమెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం మరిన్ని కలెక్షన్ లను సాధిస్తూ దూసుకుపోతోంది.