సిగరెట్లు కాలుస్తా,మందుకొడుతా.. మీకేంటి ప్లాబ్లం?

సోషల్ మీడియాలో సెలబ్రెటీలు చేసే హంగామా ఓ రకంగా ఉండటం లేదు. ఒక ఫొటో పెట్టడం దాని మీద ఎవరైనా స్పందిస్తే…వాళ్లకు వ్యంగ్యంగా సమాధానం ఇవ్వటం చేస్తున్నారు. అవి ఒక్కోసారి గురి తప్పి బూమరాంగ్ అవుతున్నాయి.అలాంటిదే ఇప్పుడు బాలీవుడ్‌ నటి శ్వేతా సాల్వే కు ఎదురైంది.

రీసెంట్ గా శ్వేత తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు గోవాకు వెళ్లింది. సర్లే ఎలాగో వెళ్లాం కదా అని…బికినీలో సిగెరెట్ కాలుస్తున్నప్పుడు తీసిన ఫొటోను శ్వేత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో చూసిన కొందరు ఆమెకు నీతి పాఠాలు బోధించటం మొదలెట్టారు. మరికొందరు కోపంతో ఇష్టం ఇచ్చినట్లు ఆమెతో మాట్లాడుతున్నారు. ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు మంచి మదర్ కానేకాదు. మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లే వస్తాయి?’ అని కామెంట్లు చేశారు.

ఈ కామెంట్లపై విసుగెత్తిన శ్వేత స్పందిస్తూ. ‘అవును నేను తాగుతాను, సిగెరెట్లు తాగుతాను . నేను నిజాయతీగా ఉంటాను. కేవలం దాగి, సిగరెట్‌ తాగడం వల్ల మంచి తల్లిని కాకుండా పోతా ? నా లైఫ్ ని వేస్ట్ చేసుకోవడం మీరు చూశారా? పనిచేయకుండా ఖాళీగా గడపడం గమనించారా? నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించానా? రోజూ ఎన్నో పనులతో బిజీగా ఉంటాను.

 

from Instagram

నేను నటిని, డ్యాన్సర్‌ను,ఇండ్రస్టలిస్ట్ ని కూడా. ఇతరులను ఎప్పుడూ నేను ఈ విధంగా ప్రశ్నించను. కాబట్టి నా పర్శనల్ లైఫ్ కి సంబంధించి మీరూ ఇలాంటి ప్రశ్నలు వేయకండి. నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు. సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. వాళ్లు కూడా మద్యం, మందు తాగేవారే.

ఇప్పటికీ ఏదన్నా పంక్షన్ జరుపుకోవాలంటే నా తల్లిదండ్రులతో కలిసి మద్యం తాగుతాను. మీరు నా పోస్ట్‌లకు చేసే లైక్‌లను, ఫాలోవర్లను పట్టించుకోను. మీరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. నా పద్ధతి నచ్చకపోతే అన్‌ఫాలో అవ్వచ్చు’ అని వెల్లడిస్తూ మద్యం తాగుతున్న ఫొటోను షేర్‌ చేశారు.

Instagram account