జిమ్ లో..: రకుల్…పూజ హేడ్గే పోటా పోటీగా (వీడియో)

ఒకప్పటి హీరోయిన్స్ శరీరం ఎలా ఉన్నా సమస్య ఉండేది కాదు. వారి నటన చూడటానికి ప్రేక్షకులు థియోటర్ కు వచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్దితి లేదు. హీరోయిన్స్ సైతం హీరోలకు పోటీగా జీరో సైజ్ లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ జిమ్ లో ఎక్సరసైజ్ లు చేస్తూ గడపాల్సిన పరిస్దితి. అలా కష్టపడే హీరోయిన్స్ లో రకుల్ ప్రీతి సింగ్ ఒకరు.

పూజ హేడ్గే కూడా క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తూంటుంది. ఆ విషయం వారి శరీరమే చెప్తూంటుంది. తాజాగా వీళ్లిద్దరు కలిసి జిమ్ లో వ్యాయామం చేస్తూ గడిపారు. ముంబై లోని ఒక ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ హారిసన్ జేమ్స్ కు సంబంధించిన జిమ్ లో చేసిన విన్యాసాలు చూస్తే మీకే అర్థం అవుతుంది.

https://youtu.be/VtBQJqlQRIs?t=3

ఈ హీరోయిన్లు ఇద్దరూ జిమ్ లో టఫ్ గా ఉండే స్త్రెంగ్థ్ ఎక్సర్ సైజులు చేయటం మనకీ ఉత్సాహాన్ని ఇస్తుంది. పూజ తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో కూడా అప్పుడప్పుడూ తన ఎక్సరసైజ్ లుకు సంభందించిన వీడియోలు పోస్ట్ చేస్తుంది.

కేవలం వ్యాయామాల విషయంలోనే కాదు..కెరీర్ లోనూ ఇద్దరూ పోటా పోటీగా ఉంటున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ తో పాటుగా ప్రభాస్..జిల్ రాధాకృష్ణ చిత్రాలలో నటిస్తోంది. మరోవైపు రకుల్ ..తమిళ లో సూర్య ‘ఎన్ జికె’.. కార్తీ కొత్త చిత్రం ‘దేవ్’.. శివకార్తికేయన్ తో మరో చిత్రం లో నటిస్తూ బిజీగా ఉంది.