Pooja hedge: 70 ఏళ్లనాటి చీరలో బుట్టబొమ్మ… అలనాటి జ్ఞాపకాలు అద్భుతం అంటూ!

Pooja hedge: సినీనటి పూజ హెగ్డే చాలా రోజుల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ వరుసగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా తిరిగి బిజీ అయ్యారు.

పూజా హెగ్డే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో హీరో సూర్యతో కలిసి రెట్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మే ఒకటవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఫోటోలను పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఈమె గ్రీన్ కలర్ పట్టు చీరలో కనిపించారు. ఇక పూజా హెగ్డే కట్టుకున్న ఈ చీర తన అమ్మమ్మ చీరనీ ఇది 70 ఏళ్ల నాటి చీర అని తెలుస్తుంది.

ఇలా చీర కట్టులో పూజ హెగ్డే ఈ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ…70 ఏళ్ల నాటి అద్భుతమైన చీర.. నా అందమైన అమ్మమ్మ కంజీవరంలో గడిపిన దృశ్యాలు, పెళ్లికి వెళ్లే ముందు ఇంట్లో ఉండే మల్లెల వాసన, తొలి చినుకుల తర్వాత తడిసిన మంగళూరు బురద వాసనలు.. ఓహ్, చిన్న విషయాల్లో ఎంత అందం అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు. ఇలా తన అమ్మమ్మ చీరను కట్టుకొని ఈమె ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలం అంటూ ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే…రజినీకాంత్ ‘కూలీ’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో పాటు విజయ్ ‘జననాయగన్’, లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కాంచన 4’లో పూజ నటిస్తోంది. అలాగే ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.