జగన్ సమక్షంలో మరొక కీలక ఘట్టం

జగన్ సమక్షంలో విశాఖలో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ప్రత్యేకహోదా కోసం మొదటి నుండి వైసీపీ పోరాడుతోంది. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే వస్తుంది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు కూడా చేసారు. కాగా ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ మరో కార్యం తలపెట్టారు.

ప్రజల డిమాండ్ కేంద్రానికి గట్టిగా వినిపించేలా జై ఆంధ్రప్రదేశ్ పేరిట వచ్చే నెల 6 న వైఎస్ జగన్ విశాఖలో ఇందిరా మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాటు కోసం పనులు ముమ్మరం చేసారు పార్టీ శ్రేణులు. ఈ సభను విజయవంతం చేయటానికి పలు శ్రద్ధలు తీసుకుంటున్నారు.

ఆంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు జరుపుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న ఆంధ్ర ప్రజానీకం ఈ బహిరంగసభకు తమ మద్దతు తెలుపుతున్నారు.

అయితే సభకు వెళ్లకుండా టీడీపీ ప్రజలను ఇప్పటి నుండే బెదిరించడం మొదలెట్టింది అంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి వార్డు పెద్దలను సభకు వెళ్లవద్దంటూ హెచ్చరిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. అధికార పార్టీ ఎన్ని ఆటంకాలు తలపెట్టినా సభను వియజయవంతం చేస్తాం అని వైసీపీ నేతలు బలంగా చెబుతున్నారు.