పిల్లల ముందే ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. చివరకు ఆ ఇంటి పెద్దను హత్య చేసేలా చేసింది.  ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంతో అయిన వారిని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. అటువంటి సంఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది.

ఖమ్మం జిల్లా జూలూరు పాడుకు చెందిన హామీదాకు వైరా మండలానికి చెందిన షేక్ అబ్ధుల్లాతో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. అబ్దుల్లా ఓ ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రిషియన్ గా పని చేస్తున్నాడు. హమీదాకు ఇదే ప్రాంతానికి చెందిన షేక్ అక్బర్ తో పరిచయం ఏర్పడింది.   ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అబ్దుల్లా ఇంట్లో లేని సమయంలో అక్బర్  వారి ఇంటికి వచ్చి పోయేవాడు. భార్య ప్రవర్తన పై అనుమానం వచ్చి అబ్దుల్లా నిలదీసినా ఆమెలో మార్పు రాలేదు. రెండు మూడు సార్లు హమీదా అక్బర్ తన ఇంట్లోనే ఉండడాన్ని చూశాడు., కానీ దానిని ఏదో చెప్పి అబ్దుల్లాను తప్పు దారి పట్టించింది.

 దీంతో అనుమానం వచ్చిన అబ్దుల్లా మారాలని భార్యను కోరినా ఆమె మారలేదు. ఓ సారి ఇద్దరు ఇంట్లో ఉండగానే చూశాడు. దానిని పెద్ద మనుషులకు చెప్పాడు. వారు సర్ధి చెప్పి ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చారు. అయినా హమీదా మారలేదు. దీంతో వారం క్రితం అబ్దుల్లాకు అక్బర్ కు పంచాయితీ నడిచింది. అప్పుడు అబ్దుల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా సర్ది చెప్పి పంపారు. 

హమీదా, అక్బర్

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలని ప్రియుడితో కలిసి హమీదా ప్లాన్ చేసింది. గురువారం రాత్రి అబ్దుల్లా గాఢ నిద్రలో ఉండగా అక్బర్ వారింటికి వచ్చాడు. హమీదా అబ్దుల్లా  కాళ్లు పట్టుకోగా అక్బర్ దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత భర్త మూర్చ వ్యాధితో చనిపోయాడని హమీదా అందరిని నమ్మించే పని చేసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారించగా హమీదా అసలు విషయం చెప్పింది. దీనికి హమీదా ఇద్దరు బిడ్డలే సాక్ష్యం చెప్పారు. డాడీని చంపేముందు తాము మేల్కోనే ఉన్నామని అక్బర్ అంకుల్ లో కలిసి మమ్మీ చంపిందని తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైంది.  పోలీసులు కేసు నమోదు చేసి ఉంటే ప్రాణాలు దక్కేవని పలువురు చర్చించుకున్నారు.