హిందూపురంలో వైద్య విద్యార్థిని హత్య.. పోలిసుల విచారణలో బయటపడ్డ అసలు నిజాలు..?

దేశంలో రోజురోజుకీ క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఈ రోజుల్లో మనుషులు ప్రాణాలు తీయడం చాలా తేలికగా మారిపోయింది. చిన్న చిన్న సమస్యలకు కూడా మనుషుల ప్రాణాలను తీస్తున్నారు. ఇటీవల హిందూపురంలో వీడి రోడ్డులోని జీఆర్‌ లాడ్జిలో మరణించిన వైద్య విద్యార్థిని అక్షితది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఆమె వెంట ఉన్న మహేశ వర్మ ని విచారించిన పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు.

వరంగల్లుకు చెందిన అక్షిత వైద్య విద్య అభ్యసిస్తోంది. ఐదు నెలల క్రితం పఠానచెరువు ప్రాంతానికి చెందిన మహేష్‌ వర్మతో వ్యక్తి తో అక్షిత కి బస్సులో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వల్ల ఇద్దరు ఇనస్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేసేవారు. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో ఉన్న అక్షిత ఫోటోలను మహేశ్ వర్మ డౌన్లోడ్ చేసుకుని వాటిని మార్ఫింగ్ చేసి డబ్బు కోసం అక్షిత ను బెదిరించేవాడు. అంతేకాకుండా తనకు లొంగకపోతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించేవాడు. ఈనెల 23న సాయంత్రం అక్షిత కాలేజ్ కి వెళ్ళటానికి హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి బయల్దేరింది. ఈ క్రమంలో ఈనెల 24న ఉదయం 10.30 గంటలకు హిందూపురం రైల్వే స్టేషనలో దిగి మరో రెండు గంటల్లో చిక్కబళ్లాపురం చేరుకుంటానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించింది.

హిందూపురం పట్టణంలోని జీఆర్‌ లాడ్జిలో అక్షిత మహేష్ వర్మ ఇద్దరుకలసి గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరిమద్య డబ్బు విషయంలో గొడవ జరిగింది. దీంతో మహేష్ వర్మ అక్షిత ని గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మహేశ్వర్మ పోలీసులకు ఫోన్ చేసి అక్షిత మరణించిన విషయం తెలియజేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించగా మొదట మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అక్షిత సోదరుడి ఫిర్యాదు మేరకు ఇది హత్యగా కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న మహేష్ వర్మ కోసం గాలింపు మొదలుపెట్టారు.