ఇంతకీ ఆ 8 మంది టిడిపి ఎంఎల్ఏలు ఎవరబ్బా ?

అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబునాయుడుపై  జగన్మోహన్ రెడ్డి పెద్ద బాంబే పేల్చారు. వైసిపిలోకి వచ్చేయటానికి టిడిపిలో కొందరు ఎంఎల్ఏలు రెడీగా ఉన్నట్లు నిండు సభలో చెప్పటం కలకలం రేగింది. ఓ ఎనిమిది మంది ఎంఎల్ఏలను లాగేసుకుంటే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదంటూ  చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

జగన్ ప్రకటన ఎలాగున్నా వైసిపి వైపు చూస్తున్న 8 మంది టిడిపి ఎంఎల్ఏలు ఎవరబ్బా అనే చర్చ మాత్రం పార్టీలో జోరందుకుంది. టిడిపి తరపున గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు.  అందులో 11 మంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే. కాబట్టి మిగిలిన 12 మందిలో ఎవరైనా వైసిపితో టచ్ లో ఉన్నారా అంటూ చంద్రబాబు అప్పుడే ఆరాలు కూడా మొదలుపెట్టారు.

అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో తన సామాజికవర్గం ఎంఎల్ఏలు వైసిపిలోకి వెళ్ళరనే ధీమాతో ఉన్నారు. అందుకే మిగిలిన వాళ్ళ విషయంలోనే ఎంక్వైరీలు మొదలుపెట్టారట. కానీ చాలామంది ఎంఎల్ఏలపై చాలా అవినీతి ఆరోపణలున్నాయి. వాళ్ళల్లో ఎవరిపైన కేసులు పెట్టాలన్నా కావాల్సినన్ని  ఆధారాలు దొరుకుతాయి. కాబట్టి సామాజికవర్గాలను పక్కనపెడితే వైసిపితో కొందరు టచ్ లో ఉన్నారనే అంటున్నారు.

తమతో 8 మంది టిడిపి ఎంఎల్ఏలు టచ్ లో ఉన్నట్లు వైసిపి ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరెడ్డి చెప్పారు. దాంతో ఆ ఎనిమిది మందెవరు అనే విషయంలో విచారణలు మొదలయ్యాయి. అలాగే ముగ్గురు ఎంఎల్సీలు కూడా గోడ దూకటానికి రెడీగా ఉన్నారట.  దానికితోడు టిడిపి ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తమకు 5 గురు ఎంఎల్ఏలు మిగిలినా చాలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయటానికి అని చెప్పటం మరింత గందరగోళానికి దారితీసింది.