టీడీపీ ఎంపీ శివప్ర‌సాద్‌కి షాకిచ్చిన తమన్నా

విభజనచట్టంలో ఆంధ్రాకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రక రకాల వేషధారణలతో పార్లమెంటులో నిరసన తెలిపారు ఎంపీ శివప్రసాద్. ఒక్కో రోజు ఒక్కో వేషం ధరించి ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీని డిమాండ్ చేస్తూ వచ్చారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు చివరి రోజు ట్రాన్స్ జెండర్ గెటప్ లో నిరసన తెలిపిన ఎంపీ శివ ప్రసాద్ “మోడీ బావా…ఏపీకి ఇచ్చిన హామీలు తీర్చవా” అంటూ తనదైన శైలిలో పాట ఆలపించారు. ఈ గెటప్ చూసి సోనియా గాంధీ కూడా ఆయనను మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ గెటప్ వేసిన కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు శివప్రసాద్.

నంద్యాల హిజ్రాలు తమ మనోభావాలను శివప్రసాద్ కించ పరిచాడని ఆయనపై కేసు నమోదు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి ఆడియో టేప్ రికార్డ్ లీక్ చేసిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి సైతం శివప్రసాద్ గెటప్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. హిజ్రా వేషధారణ వేసి శివ ప్రసాద్ మా మనోభావాలను దెబ్బ తీశారంటూ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో ఆమె కంప్లెయింట్ ఫైల్ చేశారు. శివ ప్రసాద్ హిజ్రాలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది తమన్నా. కింద వీడియో ఉంది చూడవచ్చు.

పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు చివరి రోజు ట్రాన్స్ జెండర్ గెటప్ వేసిన చిత్తూర్ ఎంపీ శివప్రసాద్ ఆరోజు మీడియాతో ఇలా మాట్లాడారు. బీజేపీ నుండి విడిపోయాక రెండు సెక్షన్ల నుండి నేను కళాకారుడిని కాబట్టి ప్రజల్లో ఈ పోరాట స్ఫూర్తిని వేగవంతంగా తీసుకెళ్లడానికి ఇలా వివిధ వేషాలు వేస్తూ నిరసన చేస్తున్నాను. వివిధ వర్గాల వారిని రిప్రజెంట్ చేసేలా ఇప్పటివరకు వేషాలేసాను. మిగిలింది ట్రాన్స్ జెండర్ వేషమే. ఆంధ్రాలో లక్షలాదిమంది హిజ్రాలున్నారు. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో భాగమే కాబట్టి వారిని రిప్రజెంట్ చేయటానికి ఈ గెటప్ వేశాను. అని మీడియాకి తెలిపిన శివప్రసాద్ “చూడు పిన్నమ్మ సాంగ్ ని మోదీ బావా” అంటూ ప్యారడీ చేసి పాడారు.