మహా కూటమికి కటీఫ్ దిశగా కోదండరాం

మహా కూటమిలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కూటమి పెద్దన్న కాంగ్రెస్ తీరు పట్ల భాగస్వామ్య పక్షాలైన తెలంగాణ జన సమితి, సిపిఐ, టిడిపి గుర్రుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కోదండరాం జన సమితి కాంగ్రెస్ రాజకీయాలను సహించలేకపోతున్నది. అవసరమైతే కూటమికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తో తెగ తెంపులు చేసుకునేందుకు కోదండరాం పార్టీ కసరత్తు చేస్తున్నది. 

మరో నాలుగు రోజుల్లో తాడో పేడో తేల్చుకునేందుకు జన సమితి రెడీ అయితున్నది. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి ఆపర్ చేస్తున్న సీట్ల విషయంలో ఏమాత్రం తాము సంతృప్తికరంగా లేమని తేల్చి పారేశింది జన సమితి. శనివారం సాయంత్రం కోదండరాం నాయకత్వంలో జరిగిన జన సమితి కోర్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ తీరుపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఒకవైపు రాహుల్ గాంధీని తెలంగాణ కు తీసుకొచ్చి మైలేజీ కొట్టేశామని సంబరాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కోదండరాం పార్టీ. రాహుల్ గాంధీ టిఆర్ఎస్ ను మూడు విషయాల్లో కడిగి పారేశారు. అందులో ఒకటి దళితుల విషయంలో టిఆర్ఎస్ మోసపూరిత విధానాలు అవలంభిస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో టిఆర్ఎస్ ను గుక్క తిప్పుకోనీయకుండా బాణాలు సంధించారు రాహుల్.

దాంతోపాటు నిరుద్యోగులకు టిఆర్ఎస్ నాలుగున్నరేళ్ళ పాలనలో ఒరిగిందేమీ లేదని రాహుల్ చురకలు అంటించారు. టిఆర్ఎస్ పాలనలో పట్టుమని పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని విమర్శించారు. నిరుద్యోగుల బాధలపై రాహుల్ మాట్లాడడాన్ని నిరుద్యోగులు స్వాగతించారు. టిఆర్ఎస్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని రాహుల్ చురకలు అంటించారు.

అలాగే మైనార్టీలను సైతం టిఆర్ఎస్ సర్కారు నాలుగున్నరేళ్లలో మోసం చేసిందని రాహుల్ అన్నారు. మోడీ జేబులో కేసిఆర్ ఉన్నాడని, ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని కాంగ్రెస్ విమర్శలు చేసింది. కేసిఆర్ కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే అని మైనార్టీలను హెచ్చరించింది కాంగ్రెస్ పార్టీ.

మూడు వర్గాలను టిఆర్ఎస్ కు దూరం చేయగలిగామని సంబరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కోదండరాం ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీరుపట్ల తాము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆ పార్టీ కోర్ కమిటీ అభిప్రాయపడింది. కాంగ్రెస్ ఇస్తామంటున్న సీట్లు తమకు సమ్మతం కాదని తేల్చింది. ఈనెల 24వ తేదీన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయింది. 

సిపిఐ కూడా కాంగ్రెస్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సిపిఐకి మరీ దారుణంగా సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తుండడాన్ని ఆ పార్టీ ఆక్షేపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ జన సమితికి ఆపర్ చేస్తున్న సీట్లన్నీ ఓడిపోయే చాన్స్ ఉన్నవే అని ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. 36 సీట్లు కావాలని అడిగితే పట్టుమని పది సీట్లు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రాకపోవడం ఆ పార్ 

 

మహా కూటమిలో భాగంగా టీజెఏస్ కు ఇస్తామంటున్న సీట్ల విషయంలో కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనల పట్ల టీజేఎస్ తీవ్ర అసంత్రప్తి వ్యక్తం చేసిందని టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం పార్టీ అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన పార్టీ కొర్ కమిటీ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో టీజేఎస్ కు సీట్ల విషయంలో కాంగ్రెస్ ముందుకు చేస్తున్న ప్రతిపాదనలపై చర్చించారు.. వారు చేస్తున్నవేవీ తమకు ఆమోదయోగ్యం కాదన్న యోచనకు వచ్చింది.. ఈ నేపథ్యంలో ఈనెల 24 వ తేదీన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్యాయించామని.. అందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెంకట్ రెడ్డి వివరించారు.