ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఒక విధంగా అన్యాయం చేస్తున్నారా? అనే ప్రశ్నకు నెటిజన్ల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా సీఎం జగన్ 14 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశమిచ్చి పాత కేబినేట్ కు చెందిన 11 మందిని కొనసాగించారు. అయితే కొడాలి నానికి మంత్రిగా జగన్ అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్ల విషయంలో ఈ విధంగా వ్యవహరించే వారు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జక్కంపూడి రామ్మోహన్‌రావు అనారోగ్యానికి గురి అయినా ఆయనను మంత్రిగా కొనసాగించారు. టీడీపీ నేతలు సైతం కొడాలి నానిని ఈ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారనే సంగతి తెలిసిందే.
జగన్ నమ్ముకున్న వాళ్లను ఒక విధంగా మోసం చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా జగన్ నుంచి నామమాత్రపు స్పందన కూడా లేదు. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న వాళ్లను జగన్ నిర్లక్ష్యం చేయడం కరెక్టేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యేలకు తానున్నానంటూ భరోసా ఇవ్వడంలో జగన్ ఫెయిల్ అవుతున్నారు.
జగన్ నమ్మకమైన ఎమ్మెల్యేల విషయంలో తను కూడా అదే స్థాయిలో నమ్మకాన్ని కలిగించాల్సి ఉంది. జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం వైసీపీకి భవిష్యత్తులో కచ్చితంగా నష్టం కలుగుతుంది. పార్టీకి ప్లస్ అయ్యే దిశగా జగన్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. పార్టీ విషయంలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకుంటారో లేక తప్పటడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.